Hyderabad: ఆర్టీఐ చీఫ్ కమిషనర్‌గా చంద్రశేఖర్‌రెడ్డి!
ABN , Publish Date - Apr 27 , 2025 | 04:33 AM
రాష్ట్రంలో ఎట్టకేలకు సమాచార హక్కు (ఆర్టీఐ) చట్టం కమిషనర్ల నియామకానికి రంగం సిద్ధమైంది. గత కొన్నేళ్లుగా ఖాళీగా ఉన్న ఈ పోస్టులను పూర్తి స్థాయిలో భర్తీ చే సేందుకు ఎంపిక చేసిన వారి జాబితా రాజ్‌భవన్‌కు చేరింది.
ఐదుగురు కమిషనర్ల నియామక ఫైలు గవర్నర్‌కు..
రాష్ట్రంలో ఎట్టకేలకు సమాచార హక్కు (ఆర్టీఐ) చట్టం కమిషనర్ల నియామకానికి రంగం సిద్ధమైంది. గత కొన్నేళ్లుగా ఖాళీగా ఉన్న ఈ పోస్టులను పూర్తి స్థాయిలో భర్తీ చే సేందుకు ఎంపిక చేసిన వారి జాబితా రాజ్‌భవన్‌కు చేరింది. గవర్నర్ జిష్ణుదేవ్‌వర్మ ఆమోదం లభించగానే నియామకాలు చేపట్టనున్నారు. ఆర్టీఐ చట్టం ప్రధాన కమిషనర్‌గా చంద్రశేఖర్‌రెడ్డిని నియమించాలని ప్రభుత్వం ఇప్పటికే సూత్రప్రాయంగా నిర్ణయించింది.
ఆయనతోపాటు మరో ఐదుగురిని సమాచార కమిషనర్లుగా నియమించే ఫైలు శనివారం గవర్నర్ వద్దకు చేరింది. ప్రతిపాదిత ఐదుగురు కమిషనర్లలో.. ఒక జర్నలిస్టు, మరో ఇద్దరు మాజీ జర్నలిస్టులు, పూర్వ నల్గొండ జిల్లా నుంచి బీసీ సామాజిక వర్గానికి చెందిన ఒక న్యాయవాది, మహబూబ్‌నగర్ జిల్లా నుంచి ఎస్టీ సామాజిక వర్గానికి చెందిన ఒక రు ఉన్నట్టు సమాచారం.