Telangana News: పుప్పాల గూడలో అగ్ని ప్రమాదం.. ముగ్గురు మృతి!
ABN , Publish Date - Feb 28 , 2025 | 08:03 PM
పుప్పాల గూడలో భారీ అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. ఈ ప్రమాద ఘటనలో ముగ్గురు వ్యక్తులు మృతి చెందారు. మరో ఐదుగురు తీవ్రంగా గాయపడ్డారు. పుప్పల్‌గూడలోని పాషా కాలనీలో కిరానా దుకాణంలో షార్ట్ సర్క్యూట్ కారణంగా మంటలు చెలరేగాయి.
పుప్పాల గూడలో భారీ అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. ఈ ప్రమాద ఘటనలో ముగ్గురు వ్యక్తులు మృతి చెందారు. మరో ఐదుగురు తీవ్రంగా గాయపడ్డారు (Fire Accident). పుప్పల్‌గూడలోని పాషా కాలనీలో కిరానా దుకాణంలో షార్ట్ సర్క్యూట్ కారణంగా మంటలు చెలరేగాయి. గ్రౌండ్ ఫ్లోర్‌లోని కిరాణా షాపులో విద్యుత్ షార్ట్ సర్క్యూట్ కారణంగా మంటలు చెలరేగి తీవ్ర రూపం దాల్చాయి. అగ్ని ప్రమాదంలో పేలిన మూడు గ్యాస్ సిలిండర్లు పేలిపోయాయి. దీంతో ఆ ప్రాంతవాసులు తీవ్ర ఆందోళనకు గురయ్యారు (Telangana News).
భారీ మంటల కారణంగా పరిసర ప్రాంతాలన్నీ పొగతో నిండిపోయాయి. మంటల వల్ల ఏర్పడిన భారీ పొగ కారణంగా ఊపిరాడక ముగ్గురు మృతి చెందారు. మృతి చెందిన వారిని సిజిరా ఖాటూన్(7) జమీలా ఖాతూన్(70), సహానా ఖాతూన్(40)గా గుర్తించారు. మరో ఐదుగురిని ఫైర్ సిబ్బంది కాపాడారు. ఆ ఐదుగురిలో ఇద్దరికి ఫ్రాక్చర్ అయింది. దీంతో వారిని వెంటనే ఉస్మానియా ఆస్పత్రికి తరలించారు. ఫైర్ సిబ్బంది మంటలను అదుపులోకి తీసుకొచ్చారు. ఘటనా స్థలానికి చేరుకున్న అధికారులు విచారణ ప్రారంభించారు.
మరిన్ని తెలంగాణ వార్తలు కోెసం క్లిక్ చేయండి..