Share News

JAC: బీఆర్‌ఎస్‌ రజతోత్సవ సభను బహిష్కరించాలి

ABN , Publish Date - Apr 26 , 2025 | 04:21 AM

వరంగల్‌లో నిర్వహించనున్న బీఆర్‌ఎస్‌ రజతోత్సవ సభను ప్రజలు బహిష్కరించాలని తెలంగాణ ఉద్యమకారుల జేఏసీ పిలుపునిచ్చింది.

JAC: బీఆర్‌ఎస్‌ రజతోత్సవ సభను  బహిష్కరించాలి

  • తెలంగాణ ఉద్యమకారుల జేఏసీ డిమాండ్‌

బర్కత్‌పుర, ఏప్రిల్‌ 25(ఆంధ్రజ్యోతి): వరంగల్‌లో నిర్వహించనున్న బీఆర్‌ఎస్‌ రజతోత్సవ సభను ప్రజలు బహిష్కరించాలని తెలంగాణ ఉద్యమకారుల జేఏసీ పిలుపునిచ్చింది. పదేళ్ల కేసీఆర్‌ పాలనలో జరిగిన అవినీతి, అక్రమాలపై సీబీఐతో విచారణ జరిపించాలని, ఆయన కుటుంబం అక్రమంగా సంపాదించిన సొమ్మును స్వాధీనం చేసుకోవాలని డిమాండ్‌ చేసింది.


ఉద్యమకారులపై పెట్టిన ఉపా వంటి కేసులను తక్షణమే ఎత్తివేయాలని డిమాండ్‌ చేసింది. తెలంగాణ ఉద్యమకారుల జేఏసీ చైర్మన్‌ సుల్తాన్‌ యాదగిరి తదితరులు మీడియాతో మాట్లాడారు. బీఆర్‌ఎస్‌ ఆవిర్భవించి మూడేళ్లు మాత్రమేనని రజతోత్సవం పేరుతో మరోసారి మోసం చేసేందుకు కేసీఆర్‌ ప్రయత్నిస్తున్నారని ఆరోపించారు.

Updated Date - Apr 26 , 2025 | 04:21 AM