Human Rights Commission: శోభాయాత్ర ప్రమాదంపై హక్కుల కమిషన్ విచారణ
ABN , Publish Date - Aug 20 , 2025 | 04:51 AM
రామంతాపూర్‌లో కృష్ణ జన్మాష్టమి సందర్భంగా జరిగిన శోభయాత్రలో విద్యుత్‌షాక్‌తో అయిదుగురు ప్రాణాలు కోల్పోయి
సెప్టెంబరు 22లోగా నివేదికివ్వాలని డిస్కం సీఎండీకి అదేశాలు
హైదరాబాద్ సిటీ, ఆగస్టు 19 (ఆంధ్రజ్యోతి): రామంతాపూర్‌లో కృష్ణ జన్మాష్టమి సందర్భంగా జరిగిన శోభయాత్రలో విద్యుత్‌షాక్‌తో అయిదుగురు ప్రాణాలు కోల్పోయి, పలువురు గాయపడిన సంఘటనపై తెలంగాణ మానవ హక్కుల కమిషన్ సుమోటోగా విచారణకు స్వీకరించింది. సంఘటనకు గల కారణాలు, అధికారుల జవాబుదారీతనం, తక్షణ పరిష్కార చర్య లు, బాధితుల కుటుంబాలకు పరిహారం, పునరావాసం, దీర్ఘకాలిక భద్రతా చర్యలను వివరిస్తూ సమగ్ర నివేదికను సెప్టెంబరు 22 నాటికి సమర్పించాలని ఆదేశించింది. ఈ మేరకు టీజీహెచ్‌ఆర్సీ చైర్మన్ డా.జస్టిస్ షమీమ్ అక్తర్.. టీజీఎస్పీడీసీఎల్ సీఎండీ ముషారఫ్ ఫరూకీని అదేశాలు ఇచ్చారు.