Share News

మార్చి మొదటివారంలో ‘బిల్డ్‌ నౌ’ అందుబాటులోకి!

ABN , Publish Date - Feb 13 , 2025 | 03:33 AM

భవన నిర్మాణాలు, లే అవుట్‌ అనుమతుల వేగవంతం, పారదర్శకత కోసం రాష్ట్ర ప్రభుత్వం తీసుకొచ్చిన ‘బిల్డ్‌ నౌ’ వెబ్‌ పోర్టల్‌, మొబైల్‌ అప్లికేషన్‌ మార్చి మొదటి వారంలో ప్రజలకు అందుబాటులోకి రానుంది.

మార్చి మొదటివారంలో ‘బిల్డ్‌ నౌ’ అందుబాటులోకి!

  • తొలుత జీహెచ్‌ఎంసీ, హెచ్‌ఎండీయే పరిధిలో అమలు

  • భనవ నిర్మాణ అనుమతుల వేగవంతం, పారదర్శకత కోసం బిల్డ్‌ నౌ పేరుతో కొత్త ఆన్‌లైన్‌ అనుమతుల వ్యవస్థ

  • టీజీ-బీపాస్‌ స్థానంలో తీసుకువచ్చేందుకు నిర్ణయం

హైదరాబాద్‌ సిటీ, ఫిబ్రవరి 12 (ఆంధ్రజ్యోతి): భవన నిర్మాణాలు, లే అవుట్‌ అనుమతుల వేగవంతం, పారదర్శకత కోసం రాష్ట్ర ప్రభుత్వం తీసుకొచ్చిన ‘బిల్డ్‌ నౌ’ వెబ్‌ పోర్టల్‌, మొబైల్‌ అప్లికేషన్‌ మార్చి మొదటి వారంలో ప్రజలకు అందుబాటులోకి రానుంది. టీజీ-బీపాస్‌ స్థానంలో రాష్ట్ర ప్రభుత్వం దీన్ని తీసుకువస్తోంది. ‘బిల్డ్‌ నౌ’ ద్వారా తొలుత హెచ్‌ఎండీఏ, జీహెచ్‌ఎంసీ పరిధిలో అనుమతులను మంజూరు చేయనున్నారు. మిగతా ప్రాంతాల్లో కొద్దికాలం పాటు టీజీ-బీపాస్‌ ద్వారానే భవన అనుమతులు మంజూరు చేస్తారని అధికారులు తెలిపారు.


బిల్డ్‌ నౌపై అధికారులు, ఉద్యోగులు, సిబ్బంది, ఆర్కిటెక్చర్లు, బిల్డర్లు పూర్తిస్థాయిలో సంతృప్తి చెందిన తర్వాత టీజీ-బీపా్‌సను మొత్తంగా ఎత్తివేయనున్నారు. దీనికి రెండు నెలల సమయం పట్టొచ్చని భావిస్తున్నారు. బిల్డ్‌ నౌ పోర్టల్‌, యాప్‌ను ఫ్లో డబ్ల్యూ అనే సాఫ్ట్‌వేర్‌ సంస్థ రూపొందించింది. దీని ద్వారా అనుమతులు ఇచ్చే విధానంపై హెచ్‌ఎండీఏ, జీహెచ్‌ఎంసీ, డైరెక్టరేట్‌ ఆఫ్‌ టౌన్‌ అండ్‌ కంట్రీ ప్లానింగ్‌(డీటీసీపీ)లకు చెందిన అధికారులు, ఉద్యోగులు, సిబ్బందికి శిక్షణ కార్యక్రమాలను నిర్వహిస్తున్నారు.

Updated Date - Feb 13 , 2025 | 03:33 AM