Gaddar Awards: గద్దర్ అవార్డులకు ఎంట్రీల ఆహ్వానం
ABN , Publish Date - Mar 12 , 2025 | 03:35 AM
ప్రముఖ ప్రజా వాగ్గేయకారుడు గద్దర్ పేరిట ఏర్పాటు చేసి న తెలంగాణ చలన చిత్ర అవార్డులకు సంబంధించి విధివిధానాలు ఖరారు చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం మంగళవారం ఉత్తర్వులు జారీ చేసింది.

తెలంగాణ చలన చిత్ర పురస్కారాల విధి విధానాలు ఖరారు
ఫీచర్‌ఫిల్మ్, జాతీయ సమైక్యత, పర్యావరణం,
వారసత్వ సంపద, చరిత్ర, బాలల చిత్రాలకు..
తొలిసారిగా ఉర్దూ భాషా చిత్రాలకు స్థానం
పైడి జయరాజ్, కాంతారావు పేరిట అవార్డులు 2014-23 మధ్య వచ్చిన చిత్రాలకూ..
హైదరాబాద్, మార్చి11 (ఆంధ్రజ్యోతి): ప్రముఖ ప్రజా వాగ్గేయకారుడు గద్దర్ పేరిట ఏర్పాటు చేసి న తెలంగాణ చలన చిత్ర అవార్డులకు సంబంధించి విధివిధానాలు ఖరారు చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం మంగళవారం ఉత్తర్వులు జారీ చేసింది. ఈ అవార్డుల దరఖాస్తులు ఏసీగార్డ్స్‌లోని తెలంగాణ చలన చిత్ర పరిశ్రమాభివృద్ధి సంస్థ కార్యాలయంలో గురువారం నుంచి అందుబాటులో ఉంటాయి. ఫీచర్ ఫిల్మ్స్, జాతీయ సమైక్యతపై చలన చిత్రం, బాలల చలన చిత్రం. పర్యావరణం/వారసత్వ సంపద/చరిత్రపై చలన చిత్రం, యానిమేషన్ ఫిలిం, సోషల్ ఎఫెక్ట్ ఫిల్మ్, డాక్యుమెంటరీ ఫిల్మ్, లఘుచిత్రం క్యాటగిరిలతోపాటు తెలుగు సినిమాలపై వెలువడిన పుస్తకాలు, విశ్లేషణాత్మక వ్యా సాలు, ఆర్టిస్టులు/టెక్నీషియన్లను వ్యక్తిగతంగా గద్దర్ అవార్డులకు ఎంపిక చేయనున్నట్లు ప్రభు త్వం పేర్కొంది.
కాగా.. సీఎం రేవంత్ రెడ్డి గతంలో ఇచ్చిన హామీ మేరకు ప్రభుత్వం గద్దర్ అవార్డులను ఖరారు చేస్తూ.. ఉత్తర్వులు(జీవో 25) జారీ చేసిన విషయం తెలిసిందే..! తెలంగాణ సినిమా రంగానికి విశేష సేవలందించిన పైడి జయరాజ్, కాంతారావు పేర్లపై ప్రత్యేక అవార్డులు కూడా ఇవ్వాలని, ఇప్పటికే ప్రముఖ నటుడు ఎం.ప్రభాకర్ రెడ్డి పేరిట ఉన్న అవార్డును కొనసాగించాలని ప్రభుత్వం నిర్ణయించింది. 2014 నుంచి 2023 వరకు.. అప్పటి బీఆర్‌ఎస్ సర్కారు చలన చిత్ర అవార్డులను జారీ చేయకపోవడంతో, ఆ సంవత్సరాలకు సంబంధించి ఒక్కో ఉత్తమ చిత్రానికి అవార్డులివ్వాలని ప్రభుత్వం భావిస్తోంది. ఫీచర్‌ఫిలిం క్యాటగిరిలో తొలిసారిగా ఉర్దూ భాషా చిత్రాలకు కూడా స్థానం కల్పించింది.
ఈ వార్తలు కూడా చదవండి:
Jagtial wedding tragedy: 24 గంటల్లో పెళ్లి పీటలెక్కాల్సిన వరుడు... చివరకు
Telangana MPs Meet: తెలంగాణ ఎంపీల సంచలన నిర్ణయం.. వాటి కోసం ప్రతిపాదనలు సిద్ధం..