SEC Guidelines: 10న జెడ్పీటీసీ, ఎంపీటీసీ స్థానాల ఓటరు జాబితాల వెల్లడి..
ABN , Publish Date - Feb 08 , 2025 | 03:24 AM
కేంద్ర ఎన్నికల సంఘం (ఈసీఐ) అందించిన అసెంబ్లీ నియోజక వర్గాల వారీ ఓటరు జాబితా ఆధారంగా సంబంధిత విభాగాలు గ్రామ పంచాయతీ, వార్డుల వారీగా ఓటర్ల జాబితాను ఇప్పటికే సిద్ధం చేశారు.

స్థానిక సంస్థల ఎన్నికలకు ఎన్నికల సంఘం ముందస్తు చర్యలు
13న రాజకీయ పార్టీలతో సమావేశం
15న పోలింగ్‌స్టేషన్ల జాబితా ప్రకటన
హైదరాబాద్, ఫిబ్రవరి 7 (ఆంధ్రజ్యోతి): స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణకు సంబంధించి రాష్ట్ర ఎన్నికల సంఘం ముందస్తు చర్యలు చేపట్టింది. ఈ మేరకు రాష్ట్రంలోని 570 జెడ్పీటీసీ, 5817 ఎంపీటీసీ స్థానాలకు సంబంఽధించి ఓటరు జాబితాను వెల్లడించాల్సిందిగా అన్ని జిల్లాల అధికారులను ఆదేశించింది. కేంద్ర ఎన్నికల సంఘం (ఈసీఐ) అందించిన అసెంబ్లీ నియోజక వర్గాల వారీ ఓటరు జాబితా ఆధారంగా సంబంధిత విభాగాలు గ్రామ పంచాయతీ, వార్డుల వారీగా ఓటర్ల జాబితాను ఇప్పటికే సిద్ధం చేశారు. ఆ జాబితా వివరాలను సమీకరించి ఎంపీటీసీ స్థానంలో, జెడ్పీటీసీ స్థానంలో ఓటర్ల వివరాలతో జాబితాను సిద్ధం చేసి ఈనెల 10న విడుదల చేయాలని రాష్ట్ర ఎన్నికల సంఘం కార్యదర్శి అశోక్‌కుమార్ శుక్రవారం సర్క్యులర్ జారీ చేశారు. మండల పరిషత్ అభివృద్ధి అధికారులు, జిల్లా ఎన్నికల అధికారులకు ఇప్పటికే మార్గదర్శకాలు జారీ చేశామని అందుకు అనుగుణంగానే.. జాబితాను రూపొందించాలని సూచించారు.
అన్ని ఎంపీటీసీ, జెడ్పీటీసీ స్థానాల పరిధిలో పోలింగ్ స్టేషన్లను గుర్తించి.. వాటి వివరాల డ్రాఫ్ట్‌ను 11న ప్రకటించాలని, వాటిపై 12 నుంచి 13వ తేదీ వరకు అభ్యంతరాలు, సూచనలు స్వీకరించాలన్నారు. 13న రాజకీయ పార్టీల ప్రతినిధులతో సమావేశమై.. వారి సలహాలు, అభ్యంతరాలు తెలుసుకొని.. తుది జాబితాను కలెక్టర్, జిల్లా ఎన్నికల విభాగాల అనుమతి కోసం పంపాలని పేర్కొన్నారు. ఆ తర్వాత పోలింగ్ స్టేషన్ల తుది జాబితాను 15న విడుదల చేయాల్సిందిగా ఎస్‌ఈసీ కార్యదర్శి ఆదేశించారు. అలాగే ఈనెల 10లోపు గ్రామ పంచాయతీ, మండల పరిషత్, జిల్లా పరిషత్ పరిధిలో ఎన్నికల నిర్వహణ కోసం ఎన్నికల సిబ్బందిని నియమించాలని సూచించారు. ఎన్నికల కోసం నియమించిన ఎన్నికల రిటర్నింగ్ అధికారులు.. పోలింగ్‌స్టేషన్ అధికారులు, అసిస్టెంట్ పోలింగ్ స్టేషన్ అధికారులు, ఇతర పోలింగ్ సిబ్బందికి ఈనెల 12 నుంచి 15 లోపు శిక్షకుల ద్వారా శిక్షణ ఇప్పించాలని ఆదేశించారు.
ఇవి కూడా చదవండి..
Viral Video: ఇల్లు మారుతూ మనసూ గెలుచుకున్నారుగా.. ఆటో వెనుక చూడగా.. గుండెలకు హత్తుకునే సీన్..
Viral Video: కళ్లెదుటే పులి వేట.. కుక్కను ఎలా వేటాడిందో చూస్తే..
Viral Video: చీకట్లో సైకిల్‌పై వెళ్తున్న యువతి.. వెనుక కారు యజమాని నిర్వాకంతో సడన్‌గా..
Viral Video: కంటతడి పెట్టించిన కోబ్రా.. చనిపోయిన పాము పక్కన పడగ విప్పి మరీ..
Viral Video: పాక శాస్త్రంలో చేయి తిరగడమంటే ఇదేనేమో.. వంట ఎలా చేస్తున్నాడో చూస్తే..
మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..