Share News

KTR: మా విధానాలతోనే.. గ్లోబల్‌ టెక్‌హబ్‌గా హైదరాబాద్‌!

ABN , Publish Date - May 31 , 2025 | 04:36 AM

బీఆర్‌ఎస్‌ పాలనలోని పారిశ్రామిక అనుకూల విధానాల కారణంగానే ప్రఖ్యాత కంపెనీలు రాష్ట్రానికి వచ్చాయని.. హైదరాబాద్‌ గ్లోబల్‌ టెక్‌హబ్‌గా మారిందని బీఆర్‌ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కేటీఆర్‌ పేర్కొన్నారు.

KTR: మా విధానాలతోనే.. గ్లోబల్‌ టెక్‌హబ్‌గా హైదరాబాద్‌!

  • పెట్టుబడులు పెట్టేవారు తెలంగాణకు ప్రాధాన్యమివ్వాలి

  • త్రీగోర్జెస్ స్థాయిలో కాళేశ్వరం... లండన్‌ సదస్సులో కేటీఆర్‌

హైదరాబాద్‌, మే 30 (ఆంధ్రజ్యోతి): బీఆర్‌ఎస్‌ పాలనలోని పారిశ్రామిక అనుకూల విధానాల కారణంగానే ప్రఖ్యాత కంపెనీలు రాష్ట్రానికి వచ్చాయని.. హైదరాబాద్‌ గ్లోబల్‌ టెక్‌హబ్‌గా మారిందని బీఆర్‌ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కేటీఆర్‌ పేర్కొన్నారు. లండన్‌లో నిర్వహిస్తున్న బ్రిడ్జ్‌ ఇండియా వీక్‌ 2025 సదస్సులో శుక్రవారం ‘స్థిరమైన వృద్థితో ప్రపంచ ఆర్థిక రంగాన్ని నడిపించడంలో తెలంగాణ పాత్ర’ అంశంపై కేటీఆర్‌ కీలకోపన్యాసం చేశారు. తమ ప్రభుత్వం చేపట్టిన చర్యలతో.. గూగుల్‌, మైక్రోసాఫ్ట్‌, అమెజాన్‌, ఫేస్‌బుక్‌ సహా ప్రఖ్యాత కంపెనీలు హైదరాబాద్‌లో క్యాంప్‌సలను నెలకొల్పాయని చెప్పారు. 2014లో రూ.56 వేలకోట్లు ఉన్న రాష్ట్ర ఐటీ ఎగుమతులు.. 2023 నాటికి రూ.2.41 లక్షల కోట్లకు చేరాయన్నారు.


10 లక్షల మంది స్థానిక యువతకు ఉద్యోగావకాశాలు కల్పించామని చెప్పారు.భారతదేశంలో పెట్టుబడులు పెట్టాలనుకునేవారు ప్రగతిశీల రాష్ట్రమైన తెలంగాణకు మొదటి ప్రాధాన్యం ఇవ్వాలని కోరారు. తమ ప్రభుత్వం టీఎ్‌సఐపాస్‌ విధానాన్ని తెచ్చి, దరఖాస్తు చేసుకుంటే 15 రోజుల్లో అనుమతులు వచ్చేలా చేశామని తెలిపారు. బీఆర్‌ఎస్‌ పాలనలో తెలంగాణ సాధించిన విజయాలు దేశానికే కాదు ప్రపంచానికే ఆదర్శమని వ్యాఖ్యానించారు. ఇంజనీరింగ్‌ అద్భుతంగా పేర్కొనే చైనాలోని త్రీగోర్జెస్‌ డ్యామ్‌కు సమానమైన విధంగా తెలంగాణలో కాళేశ్వరం ప్రాజెక్టు కట్టామని కేటీఆర్‌ చెప్పారు. ఇది ప్రపంచంలోనే అతిపెద్ద బహుళ ఎత్తిపోతల పథకమని, ప్రతీ సీజన్‌కు 45లక్షల ఎకరాలకు సాగునీరు అందించామని తెలిపారు.


ఇవి కూడా చదవండి

ఆర్సీబీ ఓడిపోతే భర్తకు విడాకులు ఇస్తుందట.. ఇదేం పిచ్చి..

ఐఎన్ఎస్ విక్రాంత్‌ పైనుంచి పాకిస్థాన్‌కు రాజ్‌నాథ్ సింగ్ వార్నింగ్

Updated Date - May 31 , 2025 | 04:36 AM