గోదావరి-బనకచర్ల అనుసంధానాన్ని అడ్డుకోండి: తెలంగాణ
ABN , Publish Date - May 25 , 2025 | 04:28 AM
గోదావరి-బనకచర్ల అనుసంధాన ప్రాజెక్టును అడ్డుకోవాలని తెలంగాణ కోరింది.
హైదరాబాద్, మే 24 (ఆంధ్రజ్యోతి): గోదావరి-బనకచర్ల అనుసంధాన ప్రాజెక్టును అడ్డుకోవాలని తెలంగాణ కోరింది. ఈ మేరకు గోదావరి నది యాజమాన్య బోర్డు(జీఆర్‌ఎంబీ), కృష్ణా నది యాజమాన్య బోర్డు (కేఆర్‌ఎంబీ), కేంద్ర జలవనరుల సంఘం (సీడబ్ల్యూసీ) చైర్మన్‌లకు తెలంగాణ ఈఎన్‌సీ (జనరల్) జి. అనిల్ కుమార్ లేఖ రాశారు. గోదావరి-బనకచర్ల అనుసంధానంపై వివరాలు ఇవ్వాలని కోరితే... ఈ ప్రాజెక్టు ప్రతిపాదనల దశలోనే ఉందని, దీనికి సాధ్యాసాధ్యాల నివేదిక కూడా తయారు చేయలేదని, ఆ నివేదిక వచ్చాక, సీడబ్ల్యూసీ క్లియరెన్స్ తీసుకున్నాక.. డీపీఆర్‌ను సిద్ధం చేస్తామని, కానీ ఇప్పుడే ప్రాజెక్టుపై సమాచారం పంచుకోవడం సాధ్యం కాదని గత నెల (ఏప్రిల్) 7న జరిగిన గోదావరి బోర్డు సమావేశంలో ఏపీ ఈఎన్‌సీ చెప్పారని గుర్తు చేశారు.
అయితే, ఈ ప్రాజెక్టుపై ప్రాఽథమిక సాధ్యాసాధ్యాల నివేదికను నీతి ఆయోగ్ సమావేశంలో చర్చించి, ముందుకెళ్లాలని ఏపీ నిర్ణయించుకున్నట్లు సమాచారం ఉందని తెలంగాణ పేర్కొంది. తక్షణమే గోదావరి-బనకచర్ల అనుసంధాన ప్రాజెక్టులో ముందుకెళ్లకుండా అడ్డుకోవాలని డిమాండ్ చేశారు. ఇక, ఆంధ్రప్రదేశ్ పునర్‌వ్యవస్థీకరణ చట్టం-2014 ప్రకారం ఈ ప్రాజెక్టుకు అనుమతి ఇవ్వరాదని సీడబ్ల్యూసీకి కూడా విజ్ఙప్తి చేశారు.
ఇవి కూడా చదవండి
Government Doctor: భార్యను పుట్టింటికి పంపించి.. వేరే మగాళ్లతో ఇంట్లో ఆ వీడియోలు..
Telangana: కవిత చెప్పిన దెయ్యాలు వారే.. సామ సంచలన కామెంట్స్..