Telangana Dussehra School Leaves: దసరా సెలవులు ప్రకటించిన ప్రభుత్వం.. ఎన్ని రోజులంటే..
ABN , Publish Date - Sep 08 , 2025 | 04:12 PM
తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం విద్యార్థులకు గుడ్ న్యూస్ చెప్పింది. స్కూళ్లకు దసరా సెలవులను ప్రకటిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది.
హైదరాబాద్: తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం స్కూళ్లకు దసరా సెలవులను(Telangana Dussehra Holidays) ప్రకటించింది. దసరా పండుగ నేపథ్యంలో సెప్టెంబర్ 21వ తేదీ నుంచి అక్టోబర్ 3వ తేదీ వరకూ పాఠశాలలకు సెలవులు ఇచ్చింది. అదే విధంగా జూనియర్ కాలేజీలకు సెప్టెంబర్ 28వ తేదీ నుంచి అక్టోబర్ 5వ తేదీ వరకూ సెలవులు ప్రకటించింది. ఈ మేరకు రాష్ట్ర ప్రభుత్వం ఇవాళ (సోమవారం) ఉత్తర్వులు జారీ చేసింది.
కాగా, తెలంగాణలో దసరా పండుగ అత్యంత ఘనంగా జరుగుతుంది. దేవీ నవరాత్రుల కోసం హైదరాబాద్ నగరంలోని పలు వీధుల్లో అమ్మవారి విగ్రహాలను సైతం ఏర్పాటు చేస్తారు. 9 రోజుల పాటు ఎంతో భక్తి శ్రద్ధలతో పూజలు చేస్తారు. బతుకమ్మ ఆట,పాటలు ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తాయి. ఇక, ఈ ఏడాది దసరా పండుగ అక్టోబర్ 2వ తేదీన వచ్చింది. ప్రాంతాలను బట్టి పండుగ జరుపుకునే తేదీలో తేడా ఉంటుంది.
ఇవి కూడా చదవండి
రెచ్చిపోయిన పోలీస్ అధికారి.. బార్ డ్యాన్సర్‌తో కలిసి..
దసరా సెలవులు ప్రకటించిన ప్రభుత్వం.. ఎన్ని రోజులంటే..