Share News

19న రాష్ట్ర క్యాబినెట్‌ సమావేశం?

ABN , Publish Date - May 16 , 2025 | 04:35 AM

రాష్ట్ర క్యాబినెట్‌ సమావేశం ఈ నెల 19న జరిగే అవకాశం ఉంది. జూన్‌ 2న నిర్వహించే రాష్ట్ర అవతరణ దినోత్సవంపై ఈ భేటీలో చర్చించనున్నారని సమాచారం.

19న రాష్ట్ర క్యాబినెట్‌ సమావేశం?

హైదరాబాద్‌, మే 15 (ఆంధ్రజ్యోతి): రాష్ట్ర క్యాబినెట్‌ సమావేశం ఈ నెల 19న జరిగే అవకాశం ఉంది. జూన్‌ 2న నిర్వహించే రాష్ట్ర అవతరణ దినోత్సవంపై ఈ భేటీలో చర్చించనున్నారని సమాచారం. నిరుద్యోగ యువత కోసం రాష్ట్ర ప్రభుత్వం కొత్తగా ‘రాజీవ్‌ యువ వికాసం’ పథకాన్ని ప్రారంభించిన విషయం తెలిసిందే.


ఈ పథకం కింద ఎంత మంది అర్హులవుతారు, ఎంతమేర నిధులు అవసరమవుతాయన్న వివరాలపై క్యాబినెట్‌ సమావేశంలో చర్చించే అవకాశాలున్నాయి. కంచ గచ్చిబౌలి భూముల విషయంపై కూడా మంత్రిమండలి చర్చించే అవకాశం ఉన్నట్లు సమాచారం.

Updated Date - May 16 , 2025 | 04:35 AM