Share News

BC Commission: బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు కల్పించండి

ABN , Publish Date - May 02 , 2025 | 06:17 AM

తెలంగాణ బీసీలకు విద్య, ఉద్యోగ, రాజకీయ రంగాల్లో 42 శాతం రిజర్వేషన్లు అమలు కోసం చట్టరూపం ఇవ్వాలని బీసీ కమిషన్‌ ఛైర్మన్‌ జి.నిరంజన్‌ కేంద్రాన్ని కోరారు. ఈ మేరకు రాష్ట్ర ప్రభుత్వం చొరవ తీసుకుని అఖిలపక్షంతో ప్రధానిని కలవాలని సూచించారు.

BC Commission: బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు కల్పించండి

కేంద్రానికి బీసీ కమిషన్‌ చైర్మన్‌ నిరంజన్‌ వినతి

హైదరాబాద్‌, మే 1 (ఆంధ్రజ్యోతి): విద్య, ఉద్యోగ, రాజకీయ రంగాల్లో బీసీలకు 42 శాతం రిజర్వేషన్ల అమలు కోసం శాసన సభ ఆమోదించిన బిల్లుకు చట్ట రూపం కల్పించి, రాజ్యాంగంలోని 9వ షెడ్యూల్‌లో చేర్చేందుకు చర్యలు తీసుకోవాలని తెలంగాణ బీసీ కమిషన్‌ ఛైర్మన్‌ జి.నిరంజన్‌ కేంద్ర ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. ఈ విషయంలో తెలంగాణ ప్రభుత్వం సైతం చొరవ తీసుకుని అఖిల పక్షంతో ప్రధాని మోదీని కలిసి ఒప్పించే విధంగా చర్యలు తీసుకోవాలని కోరారు. గురువారం బీసీ కమిషన్‌ కార్యాలయంలో నిరంజన్‌ మీడియాతో మాట్లాడారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీలకు 42 శాతం రిజర్వేషన్లను అమలు చేయాలనే లక్ష్యంతో జనవరి 2024 నుంచి ఎన్నికలు నిర్వహించలేదని తెలిపారు. జనాభా లెక్కలతో పాటు కుల గణన చేయాలని కేంద్రం తీసుకున్న నిర్ణయాన్ని నిరంజన్‌ స్వాగతించారు.


ఇవి కూడా చదవండి

ACB Custody: విడుదల గోపిపై ఏసీబీ ప్రశ్నల వర్షం

PM Modi AP Visit: ప్రధాని మోదీ ఏపీ పర్యటన షెడ్యూల్ ఖరారు

Read Latest AP News And Telugu News

Updated Date - May 02 , 2025 | 06:17 AM