Share News

Telangana: 9 సబ్‌ రిజిస్ట్రార్‌ కార్యాలయాల్లో.. అదనపు సిబ్బంది నియామకం

ABN , Publish Date - Jun 04 , 2025 | 05:05 AM

స్లాట్‌ బుకింగ్‌ విధానంతో భూమి రిజిస్ట్రేషన్‌ కోసం కార్యాలయాల్లో పని భారం పెరిగింది. దీనివల్ల తొమ్మిది సబ్‌ రిజిస్ట్రార్‌ కార్యాలయాల్లో అదనపు సిబ్బందిని ప్రభుత్వం నియమించింది.

Telangana: 9 సబ్‌ రిజిస్ట్రార్‌ కార్యాలయాల్లో.. అదనపు సిబ్బంది నియామకం

కంది, జూన్‌ 3 (ఆంధ్రజ్యోతి): స్లాట్‌ బుకింగ్‌ విధానం వల్ల పనిభారం పెరిగిన సబ్‌ రిస్ట్రార్‌ కార్యాలయాల్లో ప్రభుత్వం అదనపు సిబ్బందిని నియమించింది. రాష్ట్రంలో భూముల రిజిస్ట్రేషన్‌ కోసం ప్రవేశపెట్టిన స్లాట్‌ బుకింగ్‌ సబ్‌ రిజిస్ట్రార్‌ కార్యాలయాలపై పనిభారాన్ని గణనీయంగా పెంచింది. ఈ నేపథ్యంలో అత్యధిక రద్దీ, పనిభారం ఉన్న తొమ్మిది సబ్‌ రిజిస్ట్రార్‌ కార్యాలయాల్లో అదనపు సబ్‌ రిజిస్ట్రార్లతో పాటు ఇతర సిబ్బందిని నియమిస్తూ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. పటాన్‌చెరు, యాదగిరిగుట్ట, గండిపేట, ఇబ్రహీంపట్నం, సూర్యాపేట, జడ్చర్ల, మహబూబ్‌నగర్‌, వనపర్తి, జోగులాంబ గద్వాలలో అదనపు సబ్‌ రిజిస్ట్రార్లను, సిబ్బందిని నియమించారు.


ఈ వార్తలు కూడా చదవండి..

సీఎం చంద్రబాబుతో హీరో అక్కినేని నాగార్జున భేటీ

ఏపీ కేబినెట్ భేటీ.. ఎప్పుడంటే..

For Telangana News And Telugu news

Updated Date - Jun 04 , 2025 | 05:06 AM