48 డెంటల్ అసిస్టెంట్ సర్జన్ పోస్టుల భర్తీ
ABN , Publish Date - Jun 27 , 2025 | 04:01 AM
రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖలో 48 డెంటల్ అసిస్టెంట్ సర్జన్ (డీఏఎస్) పోస్టుల భర్తీకి తెలంగాణ వైద్య ఆరోగ్య సేవల నియామక బోర్డు (ఎంహెచ్‌ఎస్‌ఆర్‌బీ) గురువారం నోటిఫికేషన్‌ను జారీ చేసింది.
నోటిఫికేషన్ జారీ చేసిన ఎంహెచ్‌ఎస్‌ఆర్‌బీ
హైదరాబాద్, జూన్ 26 (ఆంధ్రజ్యోతి): రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖలో 48 డెంటల్ అసిస్టెంట్ సర్జన్ (డీఏఎస్) పోస్టుల భర్తీకి తెలంగాణ వైద్య ఆరోగ్య సేవల నియామక బోర్డు (ఎంహెచ్‌ఎస్‌ఆర్‌బీ) గురువారం నోటిఫికేషన్‌ను జారీ చేసింది. ఇందులో తెలంగాణ వైద్య విధాన పరిషత్ (టీవీపీపీ) కింద 42 పోస్టులు, ఇన్సూరెన్స్ మెడికల్ సర్వీసె్‌స(ఐఎంఎస్) కింద 6 పోస్టులున్నాయని, వీటికి ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవాలని పేర్కొంది. ఈ పోస్టులకు బ్యాచిలర్ ఆఫ్ డెంటల్ సర్జన్(బీడీఎ్‌స) కోర్సు పూర్తి చేసిన అభ్యర్థులు అర్హులు. తెలంగాణ డెంటల్ కౌన్సిల్‌లో తప్పకుండా రిజిస్టర్ అయి ఉండాలి.
జూలై 14 నుంచి దరఖాస్తు చేసుకోవడానికి బోర్డు వెబ్‌సైట్ అందుబాటులోకి వస్తుంది. జూలై 25 వరకు దరఖాస్తుకు గడువు ఇచ్చారు. ఆన్‌లైన్‌లో సమర్పించిన దరఖాస్తులను జూలై 26 నుంచి 28 వరకు ఎడిట్ చేసుకునే అవకాశం కల్పించారు. 95శాతం స్థానికత ఆధారంగా పోస్టుల భర్తీ ఉంటుందని ఎంహెచ్‌ఎ్‌సఆర్‌బీ వివరించింది. కాగా.. వైద్య ఆరోగ్య శాఖలోని వైద్య విద్యా సంచాలకుల(డీఎంఈ) పరిధిలో మరో 4 స్పీచ్ పాథాలజిస్ట్ పోస్టులకు కూడా ఎంహెచ్‌ఎ్‌సఆర్‌బీ గురువారం నోటిఫికేషన్ ఇచ్చింది. ఈ పోస్టులకు జూలై 12 నుంచి 26 వరకు దరఖాస్తు చేసుకోవచ్చని పేర్కొంది.