Husband Love : వావ్.. భర్త అంటే ఇలానే ఉండాలి.. హాస్పిటల్ వార్డులో భార్యకు..
ABN , Publish Date - Feb 18 , 2025 | 01:02 PM
ఆసుపత్రిలో అనారోగ్యంతో బాధపడుతున్న తన భార్యకు సేవలు చేస్తున్న ఓ భర్త వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఇది చూసిన నెటిజన్లు ఇది కదా నిజమైన ప్రేమంటే అంటూ రకరకాలుగా కామెంట్లు పెడుతున్నారు.
భార్య భర్తల మధ్య చిన్న చిన్న మనస్పర్ధలు, గొడవలు మాత్రమే కాదు ప్రేమ, అప్యాయతలు కూడా ఉంటాయి. వాళ్లలో ఎవరికైనా ఆరోగ్యం బాగోలేకపోయినా, ఏదైనా ప్రమాదం జరిగినా ఏ మాత్రం తట్టుకోలేరు. ఆసుపత్రిలో అనారోగ్యంతో బాధపడుతున్న తన భార్యకు సేవలు చేస్తున్నాడు ఓ భర్త. ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఇది చూసిన నెటిజన్లు ఇది కదా నిజమైన ప్రేమంటే అంటూ కామెంట్లు పెడుతున్నారు.
మహబూబ్‌నగర్‌లోని ప్రభుత్వ ఆసుపత్రి వార్డులో ఒక జంట మధ్య జరిగిన సంఘటన అందరినీ భావోద్వేగానికి గురిచేసింది. తెలంగాణకు చెందిన ఒక వైద్య విద్యార్థి తన సోషల్ మీడియా ఖాతాలో ఒక వీడియోను షేర్ చేశాడు. అందులో ఒక వృద్ధుడు నేలపై కూర్చుని అనారోగ్యంతో ఉన్న తన భార్య జుట్టును దువ్వుతూ, జడ వేస్తూ కనిపించాడు. చిన్న చిన్న విషయాలకే అవేశంతో భార్యను చంపేస్తున్న ఈ రోజుల్లో ఓ వృద్ధుడు ఓపికగా తన భార్య జుట్టును దువ్వి జాగ్రత్తగా జడ వేశాడు. తన భార్యపై చూపిస్తున్న ప్రేమ అందరినీ ఆకట్టుకుంటుంది.
ఈ వీడియో వైరల్ కావడంతో అందరూ రకరకాలుగా కామెంట్లు పెడుతున్నారు. నిజమైన ప్రేమ మాటల్లో కాదు, కష్టసమయంలో తోడుగా ఉండటంలో తెలుస్తుందని, స్వచ్ఛమైన ప్రేమ ఇలాంటి సందర్భాల్లో బయటపడుతుందని కామెంట్లు పెడుతున్నారు. మరికొందరూ లవ్ సింబల్ పెడుతూ ప్రశంసలు కురిపిస్తున్నారు.
Also Read: వ్యాయామం తర్వాత గుడ్లు తినాలా లేదా అరటిపండ్లు తినాలా..