Teacher Misconduct: చిన్నారిపై టీచర్ అమానుషం!
ABN , Publish Date - Aug 07 , 2025 | 05:26 AM
పసిపిల్లాడని కూడా చూడకుండా.. ఎల్‌కేజీ విద్యార్థిని ఓ టీచర్ నిర్దాక్షిణ్యంగా లంచ్ బాక్స్‌తో కొట్టిన ఘటన సైదాబాద్ పోలీ్‌సస్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది. బాధితుల కథనం ప్రకారం..
ఎల్‌కేజీ విద్యార్థిని లంచ్ బాక్స్‌తో కొట్టిన టీచర్
తలకు గాయం, ఘటనపై పోలీసులకు ఫిర్యాదు
సైదాబాద్, ఆగస్టు 6 (ఆంధ్రజ్యోతి): పసిపిల్లాడని కూడా చూడకుండా.. ఎల్‌కేజీ విద్యార్థిని ఓ టీచర్ నిర్దాక్షిణ్యంగా లంచ్ బాక్స్‌తో కొట్టిన ఘటన సైదాబాద్ పోలీ్‌సస్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది. బాధితుల కథనం ప్రకారం.. ఎల్‌సీహెచ్ కాలనీలో నివాసముండే ఆవుల మణికంఠ కుమారుడు ఈశ్వర్.. ఇంటికి దగ్గరలోని లిటిల్ ఇండియన్ అప్పర్ ప్రైమరీ పాఠశాలలో ఎల్‌కేజీ చదువుతున్నాడు. బుధవారం మధ్యాహ్నం సమయంలో.. ఈశ్వర్‌కు తలకు గాయమై, రక్తస్రావం అవుతోందని తల్లిదండ్రులకు ప్రిన్సిపాల్ సమాచారమందించారు. వెంటనే వారు స్కూల్‌కు చేరుకుని కుమారుడిని స్థానికంగా ఉన్న ఆసుపత్రికి తరలించారు. గాయానికి మూడు కుట్లు పడ్డాయి.
ఈ విషయంపై బాలుడిని ఆరాతీయగా టీచర్ కొట్టడంతోనే గాయమైందని చెప్పాడు. తల్లిదండ్రులు స్కూల్ ప్రిన్సిపాల్‌ను నిలదీయగా.. పిల్లలు కొట్టుకోవడంతోనే కిందపడి గాయమైందని బుకాయించాడు. దీంతో తండ్రి ఘటనపై సైదాబాద్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. స్కూల్‌లో ఉన్న సీసీ కెమెరాల ఫుటేజీ ఇవ్వమని కోరినా ప్రిన్సిపాల్ ఇవ్వడం లేదని ఆయన ఆరోపించారు. టీచర్‌పై కేసు నమోదు చే శామని సైదాబాద్ పోలీసులు తెలిపారు.