Tamarind Tree: ఇదేం విడ్డూరం.. గుండ్రంగా తిరుగుతున్న చింత మొక్క
ABN , Publish Date - Aug 07 , 2025 | 08:07 AM
Tamarind Tree: ఓ చిన్న చింత మొక్క అటు, ఇటు కదులుతూ ఉంది. అది గాలికి కదులుతున్నట్లుగా లేదు. ఎవరో కిందినుంచి అటు, ఇటు తిప్పుతున్నట్లుగా ఉంది.
భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో ఓ వింత, విచిత్రమైన సంఘటన ఒకటి చోటుచేసుకుంది. ఓ చింత మొక్క అందరినీ ఆశ్చర్యపరుస్తోంది. ఆ మొక్క తనంతట తాను గుండ్రంగా తిరుగుతోంది. జిల్లాలోని ములకలపల్లి మండలం సీతారాంపురం గ్రామంలో ఈ వింత సంఘటన వెలుగు చూసింది. చింత మొక్క అలా గుండ్రంగా తిరగటం చూసిన జనం ఆశ్చర్యపోతున్నారు. ఈ విషయం తెలిసి పెద్ద ఎత్తున మొక్క దగ్గరకు జనం తరలివస్తున్నారు. చింత మొక్కను వీడియో తీస్తున్నారు.
చింత మొక్క అలా గుండ్రంగా తిరగటం దేవుడి లీలా లేక సృష్టి మాయా అనే సందేహంలో స్థానికులు ఉన్నారు. బ్రహ్మంగారి కాలజ్ఞానం నిజమవుతుందా అని చర్చించుకుంటున్నారు. ఇక, ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఆ వీడియోలో ఏముందంటే.. ఓ చిన్న చింత మొక్క అటు, ఇటు కదులుతూ ఉంది. అది గాలికి కదులుతున్నట్లుగా లేదు. ఎవరో కిందినుంచి అటు, ఇటు తిప్పుతున్నట్లుగా ఉంది.
ఇక, వైరల్‌గా మారిన ఈ వీడియోపై స్పందిస్తున్న నెటిజన్లు.. ‘మొక్క కింది భాగంలో ఏదో జీవి ఉండి ఉంటుంది. అది అటు, ఇటు తిరుగుతూ ఉంది. అందుకే మొక్క కూడా తిరుగుతూ ఉంది. అందులో ఆశ్చర్యపోవాల్సిన అవసరం ఏమీ లేదు’..‘ఇది నిజంగా దేవుడి లీలే.. బహుశా బ్రహ్మం గారు చెప్పింది నిజమే అవుతుంది కావచ్చు’..‘ఇలా మా ఊర్లో చాలా సార్లు జరిగింది. అందులో వింత ఏమీ లేదు’ అంటూ కామెంట్లు చేస్తున్నారు.
వీడియో కోసం ఇక్కడ క్లిక్ చేయండి: గుండ్రంగా తిరుగుతున్న చింత మొక్క
ఇవి కూడా చదవండి
మూడేళ్లుగా కోమాలో.. డాక్టర్లకు ఊహించని షాక్ ఇచ్చిన మహిళ..
అశ్లీల సినిమాల్లో నటన.. ప్రముఖ హీరోయిన్‌పై కేసు..