Organ Donation Surgery: మూడేళ్లుగా కోమాలో.. డాక్టర్లకు ఊహించని షాక్ ఇచ్చిన మహిళ..
ABN , Publish Date - Aug 07 , 2025 | 07:40 AM
Organ Donation Surgery: న్యూ మెక్సికోకు చెందిన ఆర్గాన్ డోనేషన్ సర్వీస్.. డానెల్లా అవయవాలు డొనేట్ చేయాలని కుటుంబసభ్యులను కోరారు. కొద్దిరోజుల క్రితమే వారు అయిష్టంగానే ఆర్గాన్ డొనేషన్‌కు ఒప్పుకున్నారు. డాక్టర్లు సర్జరీ చేస్తున్న సమయంలో డానెల్లా ఠక్కున కళ్లు తెరిచింది.
దాదాపు మూడేళ్లుగా కోమాలో ఉన్న ఓ మహిళ ఆర్గాన్ డోనేషన్ సర్జరీ జరుగుతున్న సమయంలో కళ్లు తెరిచి డాక్టర్లతో పాటు కుటుంబసభ్యుల్ని కూడా ఆశ్చర్యపరిచింది. ఈ విచిత్ర సంఘటన అమెరికాలో ఆలస్యంగా వెలుగుచూసింది. ఇందుకు సంబంధించిన వివరాల్లోకి వెళితే.. న్యూమెక్సికోకు చెందిన 38 ఏళ్ల డానెల్లా గల్లెగోస్ అనే మహిళ అనారోగ్యం నేపథ్యంలో 2022లో కోమాలోకి వెళ్లిపోయింది. అప్పటినుంచి కోమాలోనే ఉంది. దీంతో డాక్టర్లు ఆమె మామూలు మనిషి అయ్యే అవకాశం లేదని తేల్చిచెప్పారు.
ఈ నేపథ్యంలోనే న్యూ మెక్సికోకు చెందిన ఆర్గాన్ డోనేషన్ సర్వీస్.. డానెల్లా అవయవాలు డొనేట్ చేయాలని కుటుంబసభ్యులను కోరారు. కొద్దిరోజుల క్రితమే వారు అయిష్టంగానే ఆర్గాన్ డొనేషన్‌కు ఒప్పుకున్నారు. డాక్టర్లు సర్జరీ చేస్తున్న సమయంలో డానెల్లా ఠక్కున కళ్లు తెరిచింది. డాక్టర్లు షాక్ అయ్యారు. వెంటనే సర్జరీ ఆపేశారు. కుటుంబసభ్యులకు విషయం చెప్పారు. వారు ఎంతో సంతోషించారు. అయితే, డానెల్లా కంటిలో గాటు పడి ఉండటం కుటుంబసభ్యులు గమనించారు. దీనిపై డాక్టర్లతో గొడవపెట్టుకున్నారు. అది కత్తిగాటు కాదని, తడి కారణంగా రిఫ్లెక్షన్ అయి అలా కనిపిస్తోందని డాక్టర్లు వారికి సర్దిచెప్పారు.
డానెల్లా సోదరి ఆర్గాన్ డొనేషన్ సర్వీస్, డాక్టర్లపై దారుణమైన కామెంట్లు చేసింది. ఆమె మాట్లాడుతూ..‘డానెల్లాను సర్జరీకి తీసుకుపోతున్నపుడు ఆమె చేతిని పట్టుకున్నాను. ఆమెలో నాకు కదలిక కనిపించింది. డాక్టర్లకు కూడా ఈ విషయం తెలుసు. అయినా ఆర్గాన్ డొనేషన్ సర్వీస్ వాళ్ల ఒత్తిడితో ఆపరేషన్‌కు సిద్ధమయ్యారు’ అని అంది. డాక్టర్లు మాత్రం ఈ ఆరోపణల్ని ఖండించారు. డానెల్లాకు సర్జరీ జరగకుండా ఆపింది ఆర్గాన్ డొనేషన్ సర్వీస్ సభ్యులే అని అన్నారు. మొత్తానికి డానెల్లా చావునుంచి తప్పించుకుని బయటపడింది.
ఇవి కూడా చదవండి
ఆడ సింహంపై హైనాల దాడి.. భగ్గుమన్న మగ సింహం.. చివరకు..
మీ కళ్లు పవర్‌ఫుల్ అయితే.. ఈ ఫొటోల్లోని నాలుగు తేడాలను 45 సెకెన్లలో కనిపెట్టండి