Share News

Case Filed On Shwetha Menon: అశ్లీల సినిమాల్లో నటన.. ప్రముఖ హీరోయిన్‌పై కేసు..

ABN , Publish Date - Aug 07 , 2025 | 06:55 AM

Case Filed On Shwetha Menon: శ్వేత మీనన్ ‘ది అసోసియేషన్ ఆఫ్ మలయాళం మూవీ ఆర్టిస్ట్స్(అమ్మ) ప్రెసిడెంట్ పదవి కోసం పోటీ చేస్తున్నారు. ఈ నెల 15వ తేదీన ఎలక్షన్స్ జరుగుతున్నాయి. మొత్తం ఆరుగురు వ్యక్తులు ప్రెసిడెంట్ పదవి కోసం నామినేషన్ వేశారు.

Case Filed On Shwetha Menon: అశ్లీల సినిమాల్లో నటన.. ప్రముఖ హీరోయిన్‌పై కేసు..
Case Filed On Shwetha Menon

ప్రముఖ మలయాళ హీరోయిన్ శ్వేతా మీనన్‌పై పోలీసులు కేసు నమోదు చేశారు. ఆర్థిక స్వలాభం కోసం అశ్లీల సినిమాలు, ప్రకటనల్లో నటించినందుకు గానూ కొచ్చి పోలీసులు ఆమెపై చర్యలకు సిద్ధమయ్యారు. ఓ సామాజిక కార్యకర్త ఇచ్చిన ఫిర్యాదు నేపథ్యంలో శ్వేతా మీనన్ చిక్కుల్లోపడ్డారు. మార్టీన్ మేనాచారీ అనే సామాజిక కార్యకర్త ఎర్నాకులం సీజేఎమ్ కోర్టులో శ్వేత మీనన్‌పై కేసు పెట్టాడు. దీంతో ఆమెపై చర్యలు తీసుకోవాలని కోర్టు పోలీసులను ఆదేశించింది.


ఈ నేపథ్యంలోనే ప్రెవెన్షన్ ఆఫ్ అబ్‌సీనిటీ యాక్ట్ అండ్ ది ఐటీ యాక్ట్ కింద పోలీసులు ఆమెపై కేసు నమోదు చేశారు. రతీ నిర్వేదం, పాలేరీ మానిక్యం, కాలిమన్ను‌తో పాటు కం..డోమ్ యాడ్‌లో కనిపించిన నేపథ్యంలో కేసు నమోదు చేస్తున్నట్లు పోలీసులు ఎఫ్ఐఆర్‌లో పేర్కొన్నారు. కాగా, శ్వేత మీనన్ ‘ది అసోసియేషన్ ఆఫ్ మలయాళం మూవీ ఆర్టిస్ట్స్(అమ్మ) ప్రెసిడెంట్ పదవి కోసం పోటీ చేస్తున్నారు. ఈ నెల 15వ తేదీన ఎలక్షన్స్ జరుగుతున్నాయి. మొత్తం ఆరుగురు వ్యక్తులు ప్రెసిడెంట్ పదవి కోసం నామినేషన్ వేశారు. ఇలాంటి సమయంలో శ్వేతా మీనన్‌పై కేసు నమోదు కావటం చర్చనీయాంశంగా మారింది.


1995 నుంచి తెలుగు సినిమాల్లో..

శ్వేతా మీనన్ తెలుగు చిత్ర పరిశ్రమకు పాతికేళ్ల క్రితమే పరిచయం అయ్యారు. ఆమె మొదటి సినిమా ‘దేశ ద్రోహులు’. ఈ సినిమా 1995లో విడుదల అయింది. ఆ చిత్రంలో ‘అను’ అనే పాత్రలో నటించారు. ఆ తర్వాత ‘ఆనందం’ సినిమాలో స్పెషల్ సాంగ్ చేశారు. 2003లో విడుదలైన ‘జూనియర్స్’ సినిమాలో స్పెషల్ రోల్‌లో కనిపించారు. 2011లో విడుదలైన ‘రాజన్న’ సినిమాలో దొరసాని పాత్రలో నటించారు. 2017నుంచి కేవలం మలయాళంలోనే ఆమె సినిమాలు చేస్తూ ఉన్నారు.


ఇవి కూడా చదవండి

ఇన్‌స్టాగ్రామ్‌ అంతపని చేసిందన్నమాట.. ఏం జరిగిందో తెలిస్తే..

భారతీయ సంస్కృతీ వైభవ ప్రతీక చేనేత

Updated Date - Aug 07 , 2025 | 07:05 AM