Share News

కాసుల కోసం కక్కుర్తి

ABN , Publish Date - Jun 22 , 2025 | 03:58 AM

రాష్ట్రంలో వేర్వేరు ప్రాంతాల్లో ప్రజల నుంచి లంచం వసూలు చేసిన డిటెక్టివ్‌ ఇన్స్‌పెక్టర్‌, ఇద్దరు పోలీ సు కానిస్టేబుళ్లు, ఒక తహసీల్దార్‌పై సస్పెన్షన్‌ వేటు పడింది. మరో ఘటనలో రేషన్‌ కార్డు మంజూరు ప్రక్రియ పూర్తికి లంచం అడిగిన తహసీల్దార్‌ కంప్యూటర్‌ ఆపరేటర్‌ను ఏసీబీ అధికారులు రెడ్‌ హ్యాండెడ్‌గా పట్టుకున్నారు.

కాసుల కోసం కక్కుర్తి

  • వ్యాపారిని బెదిరించిన డీఐ, పోలీసుల సస్పెన్షన్‌

  • లంచం తీసుకున్న తహసీల్దార్‌పై వేటు

  • రూ.2,500 లంచం తీసుకుంటూ ఏసీబీకి చిక్కిన తహసీల్దార్‌ కార్యాలయ కంప్యూటర్‌ ఆపరేటర్‌

సికింద్రాబాద్‌/ అశ్వాపురం/ మణుగూరు/ బూర్గంపాడు, జూన్‌ 21 (ఆంధ్రజ్యోతి): రాష్ట్రంలో వేర్వేరు ప్రాంతాల్లో ప్రజల నుంచి లంచం వసూలు చేసిన డిటెక్టివ్‌ ఇన్స్‌పెక్టర్‌, ఇద్దరు పోలీ సు కానిస్టేబుళ్లు, ఒక తహసీల్దార్‌పై సస్పెన్షన్‌ వేటు పడింది. మరో ఘటనలో రేషన్‌ కార్డు మంజూరు ప్రక్రియ పూర్తికి లంచం అడిగిన తహసీల్దార్‌ కంప్యూటర్‌ ఆపరేటర్‌ను ఏసీబీ అధికారులు రెడ్‌ హ్యాండెడ్‌గా పట్టుకున్నారు. గత నెల 31న కడప జిల్లా నగల వ్యాపారి వద్ద తనిఖీలో వజ్రాలు దొరకడంతో రూ.6 లక్షలు వసూలు చేసిన సికింద్రాబాద్‌-మహంకాళీ డీఐ ప్రసాద్‌, కానిస్టేబుళ్లు మహేశ్‌, శ్యామ్‌లను సస్పెండ్‌ చేస్తూ హైదరాబాద్‌ సీపీ సీవీ ఆనంద్‌ ఆదేశాలు జారీ చేశారు.


కాగా, భద్రాద్రి-కొత్తగూడెం జిల్లా అశ్వాపురం మండలం మల్లెల మడుగు రైతు తన అక్క పేరుతో ఉన్న భూమి పట్టాను తన పేరిట మార్చడానికి తహసీల్దార్‌ కె.రాజారావు అడిగిన లంచం రూ.6,000 నగదును ఆయనకు శనివారం ఆ రైతు అందజేస్తుండగా, మరో రైతు తన ఫోన్‌లో రికార్డు చేసిన వీడియో సోషల్‌ మీడియాలో వైరలైంది. దీని పై స్పందించిన భద్రాద్రి-కొత్తగూడెం జిల్లా కలెక్టర్‌ జితే్‌ష.వి. పా టిల్‌.. సదరు తహసీల్దార్‌ను సస్పెండ్‌ చేశారు. ఇదే జిల్లా బూర్గంపాడు మండలంలో ఒక వ్యక్తి కొత్త రేషన్‌ కార్డు రేషన్‌ కార్డు ప్రక్రియ పూర్తి చేయడానికి కంప్యూటర్‌ ఆపరేటర్‌ నవక్రాంత్‌.. శనివారం రూ.2,500 లంచం తీసుకుంటుండగా పట్టుకున్నట్లు ఉమ్మడి ఖమ్మం జిల్లా ఏసీబీ డీఎస్పీ రమేశ్‌ చెప్పారు.

Updated Date - Jun 22 , 2025 | 03:58 AM