Share News

స్ఫూర్తిదాయకంగా సుప్రీంకోర్టు తీర్పులు

ABN , Publish Date - Jun 15 , 2025 | 05:52 AM

సుప్రీంకోర్టు ఇచ్చిన అనేక చరిత్రాత్మక తీర్పులు స్ఫూర్తిదాయకంగా నిలుస్తున్నాయని పలువురు హైకోర్టు న్యాయమూర్తులు పేర్కొన్నారు. 75 ఏళ్ల చరిత్రలో సూప్రీంకోర్టు నిర్దేశించిన న్యాయసూత్రాలు, కీలక తీర్పులు దేశంలోని న్యాయవ్యవస్ధకు మార్గదర్శనం చేస్తున్నాయని తెలిపారు.

స్ఫూర్తిదాయకంగా సుప్రీంకోర్టు తీర్పులు

  • హైకోర్టు న్యాయమూర్తుల ప్రశంస

హైదరాబాద్‌, జూన్‌ 14 (ఆంధ్రజ్యోతి): సుప్రీంకోర్టు ఇచ్చిన అనేక చరిత్రాత్మక తీర్పులు స్ఫూర్తిదాయకంగా నిలుస్తున్నాయని పలువురు హైకోర్టు న్యాయమూర్తులు పేర్కొన్నారు. 75 ఏళ్ల చరిత్రలో సూప్రీంకోర్టు నిర్దేశించిన న్యాయసూత్రాలు, కీలక తీర్పులు దేశంలోని న్యాయవ్యవస్ధకు మార్గదర్శనం చేస్తున్నాయని తెలిపారు. మార్వాడీ శిక్షా సమితి (ఎంఎ్‌సఎస్‌) లా కాలేజీ ఆధ్వర్యంలో ‘75 ఏళ్ల సుప్రీంకోర్టు ప్రస్థానం’పై ఉస్మానియా యూనివర్సిటీ లా కాలేజీ, తెలంగాణ ఉన్నత విద్యామండలి సహకారంతో సెమినార్‌ జరిగింది. శనివారం బేగంపేట ప్లాజా హోటల్‌లో జరిగిన ఈ కార్యక్రమంలో హైకోర్టు న్యాయమూర్తులు జస్టిస్‌ టి. మాధవీదేవి, జస్టిస్‌ నందా, జస్టిస్‌ రాధారాణి, జస్టిస్‌ నందికొండ నర్సింగ్‌రావు, పాట్నా హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్‌ అభిషేక్‌రెడ్డి, ఉన్నత విద్యామండలి చైర్మన్‌ బాలకిష్టారెడ్డి తదితరులు పాల్గొన్నారు.


న్యాయవ్యవస్థకు సంబంధించిన పలు అంశాలపై వారు ప్రసంగించారు. ప్రాథమిక హక్కుల సంరక్షణలో సుప్రీంకోర్టు పాత్రను జస్టిస్‌ రాధారాణి వివరించారు. మహిళల హక్కులకు భంగం కలగకుండా సర్వోన్నత న్యాయస్థానం తీసుకుంటున్న చర్యలపై జస్టిస్‌ మాధవీ దేవి ప్రసంగించారు. సుప్రీంకోర్టు ఇచ్చిన పలు కీలక తీర్పుల ప్రభావాన్ని ఇతర న్యాయమూర్తులు వివరించారు. ప్రాథమిక హక్కుల సంరక్షణలో సుప్రీంకోర్టు పాత్రను జస్టిస్‌ రాధారాణి వివరించారు. మహిళల హక్కులకు భంగం కలగకుండా సర్వోన్నత న్యాయస్థానం తీసుకుంటున్న చర్యలపై జస్టిస్‌ మాధవీ దేవి ప్రసంగించారు. సుప్రీంకోర్టు ఇచ్చిన పలు కీలక తీర్పుల ప్రభావాన్ని ఇతర న్యాయమూర్తులు వివరించారు.

Updated Date - Jun 15 , 2025 | 05:52 AM