Supreme Court: పెంపుడు తల్లిదండ్రుల చెంతకు చిన్నారులు
ABN , Publish Date - Aug 27 , 2025 | 05:05 AM
ఎట్టకేలకు ఆ నలుగురు చిన్నారులూ తమను పెంచుకుంటున్న తల్లిదండ్రుల చెంతకు చేరారు! 15 నెలల న్యాయపోరాటం ఫలించి..
సుప్రీంకోర్టు తీర్పుతో నలుగురు పిల్లలను అప్పగించిన శిశు విహార్ అధికారులు
మరో ఐదుగురు చిన్నారుల కేసుపై రేపు హైకోర్టులో విచారణ
పంజాగుట్ట, ఆగస్టు 26(ఆంధ్రజ్యోతి): ఎట్టకేలకు ఆ నలుగురు చిన్నారులూ తమను పెంచుకుంటున్న తల్లిదండ్రుల చెంతకు చేరారు! 15 నెలల న్యాయపోరాటం ఫలించి.. సుప్రీం తీర్పుతో ఆ చిన్నారులు తమకే చెందడంతో.. వారి పెంపుడు తల్లిదండ్రులు సంతోషంతో ఉబ్బితబ్బిబ్బయ్యారు!! చిన్నారులను విక్రయించే ముఠా నుంచి 9 మంది పిల్లలను అక్రమంగా దత్తత తీసుకుని, వారిని పెంచుకుంటున్న 9 మంది దంపతుల్లో నలుగురు దంపతులు పిల్లలను తమకే అప్పగించాలని సుప్రీం కోర్టును ఆశ్రయించిన సంగతి తెలిసిందే.
సర్వోన్నత న్యాయస్థానం వారికి అనుకూలంగా తీర్పు ఇవ్వడంతో.. వారంతా సోమవారం రాత్రే హైదరాబాద్‌లోని శిశువిహార్‌కు వెళ్లారు. సంబంధిత అధికారులు వారి వద్ద ఉన్న పత్రాలను పరిశీలించి చిన్నారులను అప్పగించారు.