Share News

Sridhar Babu: హిందూ సంప్రదాయం ప్రకారమే రాజీవ్‌, సోనియా గాంధీల పెళ్లి: శ్రీధర్‌బాబు

ABN , Publish Date - Feb 18 , 2025 | 03:51 AM

రాహుల్‌గాంధీ, రాజీవ్‌గాంధీల గురించి కేంద్రమంత్రి బండి సంజయ్‌ అడ్డగోలుగా మాట్లాడుతున్నారని, హిందూ సంప్రదా యం ప్రకారమే సోనియాగాంధీతో రాజీవ్‌గాంధీ వివాహం జరిగిందని, ఆ తర్వాత సోనియాకు గాంధీ పేరు చేర్చారని మంత్రి దుద్దిళ్ల శ్రీధర్‌బాబు అన్నారు.

Sridhar Babu: హిందూ సంప్రదాయం ప్రకారమే రాజీవ్‌, సోనియా గాంధీల పెళ్లి: శ్రీధర్‌బాబు

పెద్దపల్లి, ఫిబ్రవరి 17 (ఆంధ్రజ్యోతి): రాహుల్‌గాంధీ, రాజీవ్‌గాంధీల గురించి కేంద్రమంత్రి బండి సంజయ్‌ అడ్డగోలుగా మాట్లాడుతున్నారని, హిందూ సంప్రదా యం ప్రకారమే సోనియాగాంధీతో రాజీవ్‌గాంధీ వివాహం జరిగిందని, ఆ తర్వాత సోనియాకు గాంధీ పేరు చేర్చారని మంత్రి దుద్దిళ్ల శ్రీధర్‌బాబు అన్నారు. సోమవారం పెద్దపల్లి, రామగుండం, మంథని నియోజకవర్గాల్లో కాంగ్రెస్‌ ఎమ్మెల్సీ అభ్యర్థి నరేందర్‌రెడ్డికి మద్దతుగా పట్టభద్రుల ఆత్మీయ సమ్మేళనాలు జరిగాయి.


వీటికి హాజరైన మంత్రి మాట్లాడుతూ.. గత ప్రభుత్వ హయాంలో ఉద్యోగాలు భర్తీ కాలేదన్నారు. రాష్ట్రంలో ఖాళీ పోస్టులను భర్తీ చేసేందుకు జాబ్‌ క్యాలెండర్‌ను రూపొందించామని, ఇప్పటివరకు 55 వేల మందికి ఉద్యోగాలు కల్పించిన ఘనత తమ ప్రభుత్వానికే దక్కుతుందని చెప్పారు.

Updated Date - Feb 18 , 2025 | 03:51 AM