Share News

Sridhar Babu: డేటా ఇంజనీరింగ్‌లో 90 రోజుల ఉచిత శిక్షణ

ABN , Publish Date - Feb 22 , 2025 | 05:00 AM

నిరుద్యోగ పట్టభద్రులకు తెలంగాణ అకాడమీ ఫర్‌ స్కిల్‌ అండ్‌ నాలెడ్జి (టాస్క్‌), శ్రీ సత్యసాయి సేవా సంస్థ సంయుక్త ఆధ్వర్యంలో డేటా ఇంజనీర్‌ ట్రైనింగ్‌ ప్రోగ్రాం ఉచిత శిక్షణ ఇస్తామని మంత్రి శ్రీధర్‌బాబు తెలిపారు.

Sridhar Babu: డేటా ఇంజనీరింగ్‌లో 90 రోజుల ఉచిత శిక్షణ

  • దరఖాస్తుకు మార్చి 1 దాకా చాన్స్‌: మంత్రి శ్రీధర్‌బాబు

హైదరాబాద్‌, ఫిబ్రవరి 21 (ఆంధ్రజ్యోతి): నిరుద్యోగ పట్టభద్రులకు తెలంగాణ అకాడమీ ఫర్‌ స్కిల్‌ అండ్‌ నాలెడ్జి (టాస్క్‌), శ్రీ సత్యసాయి సేవా సంస్థ సంయుక్త ఆధ్వర్యంలో డేటా ఇంజనీర్‌ ట్రైనింగ్‌ ప్రోగ్రాం ఉచిత శిక్షణ ఇస్తామని మంత్రి శ్రీధర్‌బాబు తెలిపారు. డేటా ఇంజనీరింగ్‌ టూల్స్‌, క్లౌడ్‌ టెక్నాలజీస్‌, డేటా విజువలైజేషన్‌ తదితర అంశాలపై పట్టభద్రులకు 90రోజులపాటు శిక్షణ ఉంటుందని శుక్రవారం ఓ ప్రకటనలో చెప్పారు. కోర్సును విజయవంతంగా పూర్తి చేసిన అభ్యర్థులకు నియామకాలు కల్పిస్తారని వివరించారు. 2021 నుంచి 2024 మధ్యలో బీఎస్సీ, ఎంఎస్సీ, బీటెక్‌, ఎంటెక్‌, ఎంసీఏ ఉత్తీర్ణులైన పట్టభద్రులు మార్చి1 లోపు దరఖాస్తు చేసుకోవాలని కోరారు.

Updated Date - Feb 22 , 2025 | 05:00 AM