Share News

SR JEE Toppers: ఎస్‌ఆర్‌ విద్యార్థులకు అత్యుత్తమ ర్యాంకులు

ABN , Publish Date - Apr 20 , 2025 | 03:04 AM

జేఈఈ మెయిన్‌లో ఎస్‌ఆర్‌ విద్యాసంస్థల విద్యార్థులు అద్భుత ర్యాంకులతో ప్రతిభను చాటారు. వి. నాగ సిద్ధార్థ్ 5వ ర్యాంకుతో పాటు పలువురు విద్యార్థులు టాప్‌ ర్యాంకులు సాధించారు

SR JEE Toppers: ఎస్‌ఆర్‌ విద్యార్థులకు అత్యుత్తమ ర్యాంకులు

హనుమకొండ, ఏప్రిల్‌ 19 (ఆంధ్రజ్యోతి): జేఈఈ మెయిన్‌ ఫలితాల్లో ఎస్‌ఆర్‌ విద్యాసంస్థల విద్యార్థులు ప్రభంజనం సృష్టించారు. ఓపెన్‌, ఇతర కేటగిరీలు కలిపి జాతీయ స్థాయిలో ఎస్‌ఆర్‌ విద్యా సంస్థలకు చెందిన వి.నాగ సిద్ధార్థ 5వ ర్యాంకు, పాటిల్‌ సాక్షి 48వ ర్యాంకు, ఎం.అరుణ్‌ 60వ ర్యాంకు, వై.భరణి శంకర్‌ 88వ ర్యాంకు, బి.సురేష్‌ 98వ ర్యాంకుతో సత్తా చాటారు. వీరితో పాటు దాసరి ఫణీంద్ర 116, మోదెల వెంకట కౌషిక్‌ 141, ఈర్ల బిందుశ్రీ 142, గుట్ట దిలీప్‌ రెడ్డి 190, భూక్య వినోద్‌ 246, సీహెచ్‌ శణ్ముఖ సాయి 274, బి.ధనశణ్ముఖ శ్రీ 410, కాగితపు దీపక్‌ 491, పుత్తూరు ఉజ్వల్‌ 509 ర్యాంకులు సాధించారని ఎస్‌ఆర్‌ విద్యాసంస్థల చైర్మన్‌ ఎ.వరదారెడ్డి తెలిపారు. విద్యార్థుల విజయాల పట్ల ఎస్‌ఆర్‌ విద్యాసంస్థల చైర్మన్‌ వరదారెడ్డి, డైరెక్టర్లు మధుకర్‌రెడ్డి, సంతోష్ రెడ్డి హర్షం వ్యక్తం చేశారు.

Updated Date - Apr 20 , 2025 | 03:04 AM