Shamshabad: శంషాబాద్‌లో స్పైస్‌జెట్ విమానం ఎమర్జెన్సీ ల్యాండింగ్
ABN , Publish Date - Jun 20 , 2025 | 04:27 AM
శంషాబాద్ నుంచి తిరుపతి వెళ్తున్న స్పైస్‌జెట్ విమానం (ఎస్‌జీ-2696)లో సాంకేతిక లోపం తలెత్తడంతో విమానాశ్రయంలో ఎమర్జెన్సీ ల్యాండింగ్ అయింది. జీఎంఆర్ అధికారులు తెలిపిన వివరాల ప్రకారం..
తిరుపతి వెళ్తుండగా సాంకేతిక లోపం
గుర్తించిన సిబ్బంది.. తప్పిన ముప్పు
శంషాబాద్ రూరల్, జూన్ 19 (ఆంధ్రజ్యోతి): శంషాబాద్ నుంచి తిరుపతి వెళ్తున్న స్పైస్‌జెట్ విమానం (ఎస్‌జీ-2696)లో సాంకేతిక లోపం తలెత్తడంతో విమానాశ్రయంలో ఎమర్జెన్సీ ల్యాండింగ్ అయింది. జీఎంఆర్ అధికారులు తెలిపిన వివరాల ప్రకారం.. 80 మంది ప్రయాణికులతో గురవారం ఉదయం 6.20 గంటలకు తిరుపతి బయలుదేరిన కొద్దిసేపటికే విమానం వెనక భాగంలోని బ్యాగులున్న ప్రదేశంలో సాంకేతిక లోపాన్ని గుర్తించిన గుర్తించిన పైలెట్లు వెంటనే ఏటీసీకి సమాచారం అందించారు. అధికారుల అనుమతితో తిరిగి విమానాన్ని సురక్షితంగా శంషాబాద్ విమానాశ్రయంలో ఉదయం 7.10 గంటలకు ల్యాండింగ్ చేశారు.
ఈ సమయంలో టేకాప్, ల్యాండింగ్ కావాల్సిన కొన్ని విమాన సర్వీసులను నిలిపివేశారు. స్పైస్‌జెట్ విమానం ల్యాండింగ్ అనంతరం ఇతర విమానాల రాకపోకలను సాగించారు. అయితే, స్పైస్‌జెట్ విమాన సర్వీసును రద్దు చేయడంతో కొందరు ప్రయాణికులు తమ ప్రయాణాన్ని వాయిదా వేసుకోగా మరి కొంత మంది ఇతర విమానాల ద్వారా తిరుపతికి వెళ్లినట్లు అఽధికారులు తెలిపారు. విమానాశ్రయంలో దింపివేసిన సిబ్బంది.. ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేయకోవడంపై స్పైస్‌జెట్ విమాన ప్రయాణికులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు.