Share News

Justice B Chandrakumar: దక్షిణాదిన ఎంపీ సీట్లను తగ్గిస్తే.. కేంద్రంపై తిరుగుబాటు: చంద్రకుమార్‌

ABN , Publish Date - Jun 14 , 2025 | 03:49 AM

త్వరలో చేపట్టనున్న పార్లమెంట్‌ నియోజకవర్గాల పునర్‌విభజన జనాభా ప్రాతిపదికన చేస్తేదక్షిణాది రాష్ట్రాలు తీవ్రంగా నష్టపోయే ప్రమాదం ఉందని హైకోర్టు విశ్రాంత న్యాయమూర్తి జస్టిస్‌ బి.చంద్రకుమార్‌ అన్నారు.

Justice B Chandrakumar: దక్షిణాదిన ఎంపీ సీట్లను తగ్గిస్తే.. కేంద్రంపై తిరుగుబాటు: చంద్రకుమార్‌

  • హైదరాబాద్‌ను దేశ రెండో రాజధానిగా ప్రకటించి.. సుప్రీం బెంచిని ఏర్పాటు చేయాలి: గాలి వినోద్‌

బర్కత్‌పుర, జూన్‌ 13 (ఆంధ్రజ్యోతి) : త్వరలో చేపట్టనున్న పార్లమెంట్‌ నియోజకవర్గాల పునర్‌విభజన జనాభా ప్రాతిపదికన చేస్తేదక్షిణాది రాష్ట్రాలు తీవ్రంగా నష్టపోయే ప్రమాదం ఉందని హైకోర్టు విశ్రాంత న్యాయమూర్తి జస్టిస్‌ బి.చంద్రకుమార్‌ అన్నారు. బషీర్‌బాగ్‌ ప్రెస్‌క్లబ్‌లో సుప్రీంకోర్టు న్యాయవాది, జస్టిస్‌ ఫర్‌ సౌత్‌ ఇండియా మూమెంట్‌ వ్యవస్థాపకులు డాక్టర్‌ కరణం రాజే్‌షకుమార్‌ అధ్యక్షతన శుక్రవారం దక్షిణాది రాష్ట్రాల సమ్మేళనం నిర్వహించారు. ఐదు రాష్ట్రాలకు చెందిన పలు పార్టీల నేతలు ఈ సమ్మేళనంలో పాల్గొన్నారు. ఇందులో జస్టిస్‌ బి. చంద్రకుమార్‌ మాట్లాడుతూ.. ఎంపీ సీట్లను తగ్గిస్తే దక్షిణాది రాష్ట్రాల ప్రజలు కేంద్రంపై తిరుగుబాటు చేయాలని పిలుపునిచ్చారు. దక్షిణ భారత పొలిటికల్‌ జేఏసీ చైర్మన్‌ ప్రొఫెసర్‌ గాలి వినోద్‌కుమార్‌ మాట్లాడుతూ.. దేశ రెండో రాజధానిగా హైదరాబాద్‌ను ప్రకటించి సుప్రీంకోర్టు రీజనల్‌ బెంచ్‌ను ఏర్పాటు చేయాలని డిమాండ్‌ చేశారు. పార్లమెంట్‌ నియోజకవర్గాల పునర్‌విభజనను తక్షణమే రద్దు చేయాలని డిమాండ్‌ చేశారు.


డబ్బు కోసం మేనత్తను చంపిన కిరాతకుడు

వరంగల్‌ క్రైం, జూన్‌ 13 (ఆంధ్రజ్యోతి): జల్సాలకు అలవాటు పడి డబ్బు కోసం మేనత్తను హత్యచేసిన యువకుడిని పోలీసులు అరెస్ట్‌ చేశారు. నిందితుడి వద్ద నుంచి రూ.18 లక్షల విలువైన బంగారు, వెండి అభరణాలు రూ.10 వేలు, ద్విచక్రవాహనం స్వాధీనం చేసుకున్నారు. శుక్రవారం వరంగల్‌ సీపీ కార్యాలయంలో ఈస్ట్‌ జోన్‌ డీసీపీ అంకిత్‌కుమార్‌ కేసు వివరాలను వెల్లడించారు. వరంగల్‌ మట్టెవాడకు చెందిన రేకులపల్లి ప్రణయ్‌ ప్రైవేట్‌ ఉద్యోగం చేసేవాడు. జల్సాలకు అలవాటు పడి పెద్ద మొత్తంలో అప్పులు చేశాడు. గీసుగొండ, మట్టెవాడ పోలీ్‌సస్టేషన్‌ పరిధిలో నాలుగు చోరీలు కూడా చేశాడు. అప్పులు ఇచ్చిన వారి నుంచి ఒత్తిడి పెరగడంతో మేనత్త బంగారంపై కన్నేశాడు. ఈ క్రమంలోనే గీసుగొండ మండలంలోని స్థంభంపల్లిలో ఒంటరిగా ఉంటున్న మేనత్త స్వరూప ఇంటికి వచ్చాడు. హత్య జరిగిన రోజు సాయంత్రం మేనత్తతో కలిసి మద్యం తాగి అక్కడే పడుకున్నాడు. ఆమె నిద్రలోకి జారుకున్నాక డంబెల్‌తో తలపై మోదడంతో స్వరూప మరణించింది. అనంతరం ఆమె ఒంటిపై ఉన్న బంగారు ఆభరణాలతో పాటు ఇంట్లో ఉన్న వెండి, నగదును తీసుకుని పారిపోయాడు.


ఇవి కూడా చదవండి..

విమాన ప్రమాదం.. 10 నిమిషాల గ్యాప్‌లో ఎస్కేప్.. సుడి బాగుంది!

గుబులు పుట్టించిన మరో ఎయిరిండియా ఫ్లైట్.. 3 గంటలు గాల్లోనే..!

మరిన్ని జాతీయ వార్తల కోసం క్లిక్ చేయండి

Updated Date - Jun 14 , 2025 | 03:49 AM