Share News

Singareni: జైపూర్‌లో సింగరేణి మరో విద్యుత్‌ కేంద్రం

ABN , Publish Date - Mar 12 , 2025 | 04:06 AM

మంచిర్యాల జిల్లా జైపూర్‌ వద్ద ఉన్న 1,200 మెగావాట్ల థర్మల్‌ విద్యుత్‌ కేంద్రం ప్రాంగణంలో 800 మెగావాట్లతో మరో ప్లాంట్‌ నిర్మించేందు సింగరేణి సిద్ధమవుతోంది.

Singareni: జైపూర్‌లో సింగరేణి మరో విద్యుత్‌ కేంద్రం

  • రూ.6,700 కోట్లతో 800 మెగావాట్ల యూనిట్‌

  • నాలుగేళ్లలో కట్టేలా బీహెచ్‌ఈఎల్‌తో ఒప్పందం

హైదరాబాద్‌, మార్చి 11 (ఆంధ్రజ్యోతి): మంచిర్యాల జిల్లా జైపూర్‌ వద్ద ఉన్న 1,200 మెగావాట్ల థర్మల్‌ విద్యుత్‌ కేంద్రం ప్రాంగణంలో 800 మెగావాట్లతో మరో ప్లాంట్‌ నిర్మించేందు సింగరేణి సిద్ధమవుతోంది. రూ.6,700 కోట్లతో ఈ ప్రాజెక్టును చేపట్టేందుకు బీహెచ్‌ఈఎల్‌తో ఒప్పందం చేసుకుంది. గత ఫిబ్రవరిలోనే ఈ కాంట్రాక్ట్‌ను బీహెచ్‌ఈఎల్‌ దక్కించుకోగా.. హైదరాబాద్‌లోని సింగరేణి భవన్‌లో సోమవారం ఒప్పంద పత్రాలపై సింగరేణి, బీహెచ్‌ఈఎల్‌ సంతకాలు చేశాయి.


ఈ కార్యక్రమంలో సింగరేణి సీఎండీ బలరామ్‌, బీహెచ్‌ఈఎల్‌ జీఎం పార్థసారథి దాస్‌ పాల్గొన్నారు. నాలుగేళ్లలో ప్రాజెక్టు పూర్తి చేయాలని ఒప్పందం ఉన్నప్పటికీ.. 40 నెలల్లోనే ప్లాంట్‌ను అందుబాటులోకి తేవాలని సింగరేణి సీఎండీ బలరామ్‌ స్పష్టం చేశారు.

Updated Date - Mar 12 , 2025 | 04:06 AM