Phone Tapping: 19 మంది హైకోర్టు జడ్జిల ఫోన్ల ట్యాపింగ్
ABN , Publish Date - Feb 08 , 2025 | 02:27 AM
తెలంగాణ హైకోర్టుకు చెందిన 19 మంది జడ్జిలు, ఒక సుప్రీంకోర్టు జడ్జి ఫోన్లను ట్యాప్ చేశారని చెప్పారు. ఈ కేసులో ఏ-6గా ఉన్న ప్రైవేట్ న్యూస్ చానల్ ఎండీ శ్రవణ్‌కుమార్‌రావుకు ఎట్టిపరిస్థితుల్లోనూ బెయిల్ ఇవ్వొద్దని అన్నారు.

ఒక సుప్రీంకోర్టు జడ్జి ఫోన్‌నూ ట్యాప్ చేశారు.. హైకోర్టుకు తెలిపిన పీపీ
ప్రైవేటు న్యూస్ చానల్ ఎండీ శ్రవణ్‌కుమార్‌రావు బెయిల్‌పై ధర్మాసనం విచారణ
కేసులో ఉన్న తీవ్రత దృష్ట్యా అతనికి బెయిల్ ఇవ్వొద్దని కోరిన ప్రభుత్వ న్యాయవాది
తాను జర్నలిస్టునని, పోలీసులు పెట్టిన సెక్షన్లు తనకు వర్తించవన్న శ్రవణ్‌కుమార్
బెయిల్‌పై తీర్పు రిజర్వు.. రాధాకిషన్‌రావు ముందస్తు బెయిల్ పిటిషన్
హైదరాబాద్, ఫిబ్రవరి 7 (ఆంధ్రజ్యోతి): ఫోన్ ట్యాపింగ్ కేసులో నిందితులు తీవ్రమైన నేరాలకు పాల్పడ్డారని రాష్ట్ర పబ్లిక్ ప్రాసిక్యూటర్ (పీపీ) పల్లె నాగేశ్వర్‌రావు హైకోర్టుకు తెలిపారు. తెలంగాణ హైకోర్టుకు చెందిన 19 మంది జడ్జిలు, ఒక సుప్రీంకోర్టు జడ్జి ఫోన్లను ట్యాప్ చేశారని చెప్పారు. ఈ కేసులో ఏ-6గా ఉన్న ప్రైవేట్ న్యూస్ చానల్ ఎండీ శ్రవణ్‌కుమార్‌రావుకు ఎట్టిపరిస్థితుల్లోనూ బెయిల్ ఇవ్వొద్దని అన్నారు. ఫోన్ ట్యాపింగ్ కేసుతో తనకెలాంటి సంబంధం లేదని, తానొక జర్నలిస్టునని, పోలీసులు పెట్టిన సెక్షన్లు తనకు వర్తించవని పేర్కొంటూ శ్రవణ్‌కుమార్‌రావు దాఖలు చేసిన బెయిల్ పిటిషన్‌పై జస్టిస్ కె.సుజన ధర్మాసనం శుక్రవారం విచారణ చేపట్టింది. ఈ సందర్భంగా పల్లె నాగేశ్వర్‌రావు వాదనలు వినిపిస్తూ.. శ్రవణ్‌రావును తప్పించుకు తిరుగుతున్న నేరగాడిగా ప్రకటించాల్సిందిగా దిగువ కోర్టులో ఇప్పటికే పిటిషన్ దాఖలు చేశామని తెలిపారు. ఎఫ్‌ఎస్‌ఎల్ రిపోర్టులో కీలక విషయాలు వెల్లడయ్యాయని, తెలంగాణ హైకోర్టుకు చెందిన 19 మంది జడ్జిలు, ఒక సుప్రీంకోర్టు జడ్జి ఫోన్లను నిందితులు ట్యాప్ చేశారని వెల్లడించారు. ఇది అత్యంత తీవ్రమైన నేరమని, ఇదే విషయాన్ని హైకోర్టుకు సీల్డ్ కవర్‌లో సమర్పించామని చెప్పారు.
కేసులో ఉన్న తీవ్రత దృష్ట్యా ఏ-6కు బెయిల్ ఇవ్వరాదని కోరారు. కాగా, నిందితుడు శ్రవణ్‌రావు తరఫు న్యాయవాది వాదనలు వినిపిస్తూ.. తన క్లయింటు విదేశాల్లో ఉన్నప్పటికీ.. తన చిరునామా, ఫోన్ నంబర్లు మొత్తం పబ్లిక్ డొమైన్‌లో ఉంచారని తెలిపారు. వాటితోపాటు ఇతర అన్ని వివరాలతో హైదరాబాద్ పోలీస్ కమిషనర్‌కు పిటిషనర్ ఈ-మెయిల్ పంపారని పేర్కొన్నారు. దర్యాప్తునకు పూర్తిస్థాయిలో సహకరించడానికి పిటిషనర్ సిద్ధమని చెప్పారు. కాగా, తాను ఒక జర్నలిస్టునని, ఎవరినైనా కలిసే హక్కు తనకు ఉంటుందని, పోలీసులు పెట్టిన సెక్షన్‌లు ప్రభుత్వ ఉద్యోగులకే తప్ప.. తనకు వర్తించవని పిటిషన్‌లో శ్రవణ్‌కుమార్‌రావు అన్నారు. వాదనలు విన్న ధర్మాసనం.. తీర్పు రిజర్వు చేస్తున్నట్లు ప్రకటించింది.
రెండో కేసులో ముందస్తు బెయిల్ ఇవ్వండి..
కాంగ్రెస్ నాయకుడు, వ్యాపారి చక్రధర్‌గౌడ్, ఆయన కుటుంబ సభ్యుల ఫోన్ ట్యాపింగ్ వ్యవహారం (రెండో ఎఫ్‌ఐఆర్)లో తనకు ముందస్తు బెయిల్ ఇవ్వాలని ఈ కేసులో ఏ-2గా ఉన్న రిటైర్డ్ డీసీపీ రాధాకిషన్‌రావు హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. ఈ పిటిషన్ సింగిల్ జడ్జి ఎదుట ఈ నెల 10న విచారణకు రానుంది. కాగా, ఈ కేసును కొట్టేయాలని రాధాకిషన్‌రావు ఇప్పటికే క్వాష్ పిటిషన్ దాఖలు చేయగా.. ఈ నెల 12 వరకు ఆయనను అరెస్ట్ చేయరాదంటూ హైకోర్టు మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది. మరోవైపు ఇదే కేసులో ఏ-1గా ఉన్న హరీశ్‌రావు సైతం క్వాష్ పిటిషన్ దాఖలు చేశారు. ఈ పిటిషన్ ఈనెల 12కు వాయిదా పడింది.
ఇవి కూడా చదవండి..
Viral Video: ఇల్లు మారుతూ మనసూ గెలుచుకున్నారుగా.. ఆటో వెనుక చూడగా.. గుండెలకు హత్తుకునే సీన్..
Viral Video: కళ్లెదుటే పులి వేట.. కుక్కను ఎలా వేటాడిందో చూస్తే..
Viral Video: చీకట్లో సైకిల్‌పై వెళ్తున్న యువతి.. వెనుక కారు యజమాని నిర్వాకంతో సడన్‌గా..
Viral Video: కంటతడి పెట్టించిన కోబ్రా.. చనిపోయిన పాము పక్కన పడగ విప్పి మరీ..
Viral Video: పాక శాస్త్రంలో చేయి తిరగడమంటే ఇదేనేమో.. వంట ఎలా చేస్తున్నాడో చూస్తే..
మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..