Share News

సురవరంతో జానారెడ్డి భేటీ

ABN , Publish Date - May 11 , 2025 | 05:31 AM

సీపీఐ జాతీయ మాజీ ప్రధాన కార్యదర్శి, మాజీ ఎంపీ సురవరం సుధాకర్‌ రెడ్డితో శనివారం కాంగ్రెస్‌ పార్టీ సీనియర్‌ నాయకుడు కుందూరు జానారెడ్డి భేటీ అయ్యారు.

సురవరంతో జానారెడ్డి భేటీ

హైదరాబాద్‌, మే 10 (ఆంధ్రజ్యోతి): సీపీఐ జాతీయ మాజీ ప్రధాన కార్యదర్శి, మాజీ ఎంపీ సురవరం సుధాకర్‌ రెడ్డితో శనివారం కాంగ్రెస్‌ పార్టీ సీనియర్‌ నాయకుడు కుందూరు జానారెడ్డి భేటీ అయ్యారు. సీపీఐ జాతీయ సమితి సభ్యుడు, మాజీ ఎమ్మెల్యే పల్లా వెంకట్‌ రెడ్డి, ఆ పార్టీ ఎమ్మెల్సీ నెల్లికంటి సత్యం తదితర నాయకులతో కలిసి జానారెడ్డి.. సురవరం నివాసానికి వెళ్లి పరామర్శించారు. సురవరం ఆరోగ్యం, యోగ క్షేమాలను అడిగి తెలుసుకున్నారు. అనంతరం కొంతసేపు వారు రాజకీయ విషయాలపై చర్చించుకున్నారు.

Updated Date - May 11 , 2025 | 05:31 AM