Share News

Intermediate Admissions: జూలై 31 వరకు ఇంటర్‌ ప్రవేశాలు: ఇంటర్‌ బోర్డు

ABN , Publish Date - Jun 28 , 2025 | 04:37 AM

పదో తరగతి అడ్వాన్స్డ్‌ సప్లిమెంటరీ పరీక్ష ఫలితాలు విడుదలైన నేపథ్యంలో ఇంటర్మీడియట్‌ కోర్సుల్లో ప్రవేశాలకు రెండో విడత తేదీలను ఇంటర్‌ బోర్డు ప్రకటించింది.

Intermediate Admissions: జూలై 31 వరకు ఇంటర్‌ ప్రవేశాలు: ఇంటర్‌ బోర్డు

పదో తరగతి అడ్వాన్స్డ్‌ సప్లిమెంటరీ పరీక్ష ఫలితాలు విడుదలైన నేపథ్యంలో ఇంటర్మీడియట్‌ కోర్సుల్లో ప్రవేశాలకు రెండో విడత తేదీలను ఇంటర్‌ బోర్డు ప్రకటించింది. రాష్ట్రంలోని అన్ని ప్రభుత్వ, ప్రైవేటు, గురుకులాలు, కేజీబీవీ, మోడల్‌ స్కూళ్లు జూలై 31 వరకు ప్రవేశాలు తీసుకోవచ్చని ఇంటర్‌ విద్య కమిషనర్‌ కృష్ణ ఆదిత్య తెలిపారు.


ఇంటర్‌ ప్రవేశాలకు ఇదే చివరి అవకాశమని, తర్వాత పొడిగింపు ఉండదని ఆయన శుక్రవారం ఓ ప్రకటనలో స్పష్టం చేశారు. ఇంటర్‌ బోర్డు గుర్తింపు ఉన్న కాలేజీల్లోనే చేరాలని, అనుమతి ఉన్న కాలేజీల వివరాలు వెబ్‌సైట్లో ఉన్నాయని చెప్పారు.

Updated Date - Jun 28 , 2025 | 04:37 AM