Share News

Sanjay Kumar: దక్షిణ మధ్య రైల్వే నూతన జీఎంగా సంజయ్‌ కుమార్‌ బాధ్యతల స్వీకరణ

ABN , Publish Date - Jul 13 , 2025 | 05:19 AM

దక్షిణ మధ్య రైల్వే జనరల్‌ మేనేజర్‌ (జీఎం)గా సంజయ్‌కుమార్‌ శ్రీవాస్తవ బాధ్యతలు స్వీకరించారు.

Sanjay Kumar: దక్షిణ మధ్య రైల్వే నూతన జీఎంగా సంజయ్‌ కుమార్‌ బాధ్యతల స్వీకరణ

హైదరాబాద్‌, జూలై 12 (ఆంధ్రజ్యోతి): దక్షిణ మధ్య రైల్వే జనరల్‌ మేనేజర్‌ (జీఎం)గా సంజయ్‌కుమార్‌ శ్రీవాస్తవ బాధ్యతలు స్వీకరించారు. శ్రీవాస్తవ ఇంతకు ముం దు సెంట్రల్‌ ఆర్గనైజేషన్‌ ఆఫ్‌ రైల్వే ఎలక్ట్రిఫికేషన్‌ జీఎం గా బాధ్యతలు నిర్వర్తించారు. మొదట వల్సాద్‌లో అసిస్టెంట్‌ ఇంజనీర్‌గా వృత్తిని ప్రారంభించిన శ్రీవాస్తవ ముం బై, వడోదరలో డివిజనల్‌ ట్రాక్‌ ఇంజనీర్‌, డిప్యూటీ చీఫ్‌ ఇంజనీర్‌ వంటి పదవులను నిర్వహించారు. రైట్స్‌ (ఆర్‌ఐటీఈఎ్‌స)లో జీఎంగా, బికనీర్‌లో డివిజనల్‌ రైల్వే మేనేజర్‌గానూ పని చేశారు.

Updated Date - Jul 13 , 2025 | 05:19 AM