Rythu Bharosa: 7 ఎకరాల వరకు రైతు భరోసా నిధులు జమ.. చెక్ చేసుకోండి..
ABN , Publish Date - Jun 20 , 2025 | 08:58 PM
Rythu Bharosa: నిన్నటి వరకు ఐదు ఎకరాల వరకు పొలం ఉన్న వారి ఖాతాల్లో డబ్బులు జమ చేసింది. ఈ రోజు 7 ఎకరాల వరకు పొలం ఉన్న రైతుల ఖాతాల్లో డబ్బులు జమ చేసింది.
తెలంగాణ రైతాంగాన్ని ఆర్థికంగా ఆదుకునేందుకు కాంగ్రెస్ ప్రభుత్వం ‘రైతు భరోసా’ పథకాన్ని అమలు చేస్తున్న సంగతి తెలిసిందే. ప్రభుత్వం ఎకరాల వారీగా రైతుల ఖాతాలో డబ్బులు జమచేస్తోంది. నిన్నటి వరకు ఐదు ఎకరాల వరకు పొలం ఉన్న వారి ఖాతాల్లో డబ్బులు జమ చేసింది. ఈ రోజు 7 ఎకరాల వరకు పొలం ఉన్న రైతుల ఖాతాల్లో డబ్బులు జమ చేసింది. ఇందుకోసం మరో 905.89 కోట్లు విడుదల చేసినట్లు మంత్రి తుమ్మల తెలిపారు.
కాగా, గురువారం నాడు 4,43,167 మంది రైతుల ఖాతాల్లో ప్రభుత్వం రైతు భరోసా నిధులు జమ చేసింది. ఇప్పటి వరకు 62.47 లక్షల మంది రైతుల ఖతాల్లో రూ. 6404.7 కోట్లను ప్రభుత్వం జమ చేసింది. ఇక భూమి పరంగా చూసుకుంటే.. 106 లక్షల ఎకరాలకు పంట సహాయం అందించినట్లు ప్రభుత్వం ప్రకటించింది.
ఇవి కూడా చదవండి
విశాఖ చేరుకున్న ప్రధాని నరేంద్ర మోదీ
మెట్రో రైలులో అలజడి సృష్టించిన పాము..