Share News

TGSRTC: పల్లె వెలుగు బస్సులకు ఎక్స్‌ప్రెస్‌ బోర్డు

ABN , Publish Date - Aug 30 , 2025 | 01:18 AM

ఆర్టీసీలోని కొందరు అధికారుల తీరు ప్రయాణికులపై అదనపు భారం మోపుతోంది. పల్లె వెలుగు బస్సులకు ఇష్టానుసారంగా ఎక్స్‌ప్రెస్‌ బోర్డులు తగిలించి తిప్పుతూ ప్రయాణికుల నుంచి ఆమేరకు చార్జీలు వసూలు చేస్తున్నారు.

TGSRTC: పల్లె వెలుగు బస్సులకు ఎక్స్‌ప్రెస్‌ బోర్డు

  • ఆమేరకు చార్జీల వసూలుతో ప్రయాణికులపై భారం

హైదరాబాద్‌, ఆగస్టు 29 (ఆంధ్రజ్యోతి): ఆర్టీసీలోని కొందరు అధికారుల తీరు ప్రయాణికులపై అదనపు భారం మోపుతోంది. పల్లె వెలుగు బస్సులకు ఇష్టానుసారంగా ఎక్స్‌ప్రెస్‌ బోర్డులు తగిలించి తిప్పుతూ ప్రయాణికుల నుంచి ఆమేరకు చార్జీలు వసూలు చేస్తున్నారు. మరో వైపు పల్లె వెలుగు బస్సు వస్తోంది.. ఆపుతారని భావిస్తే ఎక్స్‌ప్రెస్‌ అని ఉండటంతో కొన్ని బస్టాపుల్లో ఆపకుండానే దూసుకుపోతున్నారు. దీంతో ప్రయాణికులకు నిరాశే ఎదురవుతోంది. ప్రభుత్వం మహాలక్ష్మి పథకం కింద పల్లె వెలుగు, ఎక్స్‌ప్రెస్‌ బస్సుల్లో మహిళలకు ఉచిత ప్రయాణ సదుపాయం కల్పిస్తున్న విషయం తెలిసిందే.


ఈ నేపథ్యంలో పల్లె వెలుగు బస్సులకు ఎక్స్‌ప్రెస్‌ బోర్డులు పెట్టి తిప్పడం పట్ల విమర్శలు వస్తున్నాయి. ‘‘పల్లె వెలుగు బస్సులకు ఎక్స్‌ప్రెస్‌ బోర్డులు తగిలించి తిప్పుతున్నమాట వాస్తవమే. అయితే కొత్త బస్సులు సర్దుబాటు అయిన డిపోల్లో అలాంటి చర్యలు నిలిపివేశాం’’అని ఆర్టీసీ అధికారి ఒకరు తెలిపారు.

Updated Date - Aug 30 , 2025 | 01:18 AM