Share News

TGSRTC: ఆర్టీసీ డ్రైవర్లకు విధుల్లో సెల్‌ఫోన్ల నిషేధం!

ABN , Publish Date - Aug 31 , 2025 | 04:16 AM

ఆర్టీసీ బస్‌ డ్రైవర్లు బస్సు నడిపే సమయంలో సెల్‌ఫోన్లు వినియోగించకుండా నిషేధించాలని ఆర్టీసీ నిర్ణయించింది.

TGSRTC: ఆర్టీసీ డ్రైవర్లకు విధుల్లో సెల్‌ఫోన్ల నిషేధం!

  • 81 నుంచి పైలెట్‌ ప్రాజెక్టుగా అమలు

హైదరాబాద్‌ సిటీ, ఆగస్టు 30 (ఆంధ్రజ్యోతి): ఆర్టీసీ బస్‌ డ్రైవర్లు బస్సు నడిపే సమయంలో సెల్‌ఫోన్లు వినియోగించకుండా నిషేధించాలని ఆర్టీసీ నిర్ణయించింది. ఈ మేరకు సెప్టెంబరు 1 నుంచి 30 వరకు 11 డిపోల పరిధిలో పైలెట్‌ ప్రాజె క్టుగా నిషేధం అమలు చేయనున్నారు. రోడ్డు భద్రతలో భాగంగా ఆర్టీసీ ఈ కీలక నిర్ణయం తీసుకుంది. డ్రైవర్లు విధుల్లో ఉన్నప్పుడు ఫోన్లు వినియోగిస్తున్నట్లు విజిలెన్స్‌ విభాగం తనిఖీల్లో గుర్తించారు. ఈ నేపథ్యంలో డ్రైవర్లు విధుల్లో ఉన్నప్పుడు ఫోన్లు వాడకుండా నెల రోజుల పాటు పైలెట్‌ ప్రాజెక్టు అమలు చేయనుంది.


11 డిపోల పరిధిలో దీన్ని అమలు చేయనుండగా గ్రేటర్‌ జోన్‌లోని ఫరూఖ్‌నగర్‌, కూకట్‌పల్లి డిపోల్లో అమలు చేయనున్నారు. డ్రైవర్లు డిపోలకు వచ్చి విధుల్లో చేరిన సమయంలో ఫోన్లను అక్కడి లాకర్లలో భద్రపరచాల్సి ఉంటుంది. సంబంధిత డ్రైవర్లకు అత్యవసర సమాచారం ఇవ్వాల్సి వస్తే ఆయా బస్సుల్లోని కండక్టర్లను సంప్రదించి ఆ సమాచారం అందించేలా చర్యలు చేపడుతున్నారు.

Updated Date - Aug 31 , 2025 | 04:16 AM