Share News

MNREGA Wages Released : ఉపాధిహామీ సిబ్బందికి వేతనాల చెల్లింపు

ABN , Publish Date - May 07 , 2025 | 07:37 AM

రాష్ట్ర ప్రభుత్వం ఉపాధిహామీ పథకం కింద పనిచేస్తున్న సిబ్బందికి మొత్తం రూ.62 కోట్లు విడుదల చేసింది. నాలుగు నెలలుగా పెండింగ్‌లో ఉన్న వేతనాలు బుధవారం నుండి ఖాతాల్లో జమ అవుతాయి

MNREGA Wages Released : ఉపాధిహామీ సిబ్బందికి వేతనాల చెల్లింపు

  • రూ.62కోట్లు విడుదల.. నేటి నుంచి ఖాతాల్లో జమ

హైదరాబాద్‌, మే 6 (ఆంధ్రజ్యోతి): ఉపాధిహామీ పథకం కింద పనిచేసే సిబ్బందికి రాష్ట్రప్రభుత్వం వేతనాలు చెల్లించనుంది. ఇందుకుగాను రూ.62 కోట్లు విడుదల చేసినట్లు సంబంధిత విభాగాలు తెలిపాయి. ఎన్‌ఆర్‌ఈజీఎ్‌స పరిధిలో రాష్ట్రవ్యాప్తంగా ఫిక్స్‌డ్‌ టెన్యూర్‌, కాంట్రాక్ట్‌, ఔట్‌సోర్సింగ్‌ ఉద్యోగులు, ఫీల్డ్‌ అసిస్టెంట్లు మొత్తం కలిపి 12,520 మంది సిబ్బంది పనిచేస్తున్నారు. వీరికి సంబంధించి నాలుగు నెలలుగా పెండింగ్‌లో ఉన్న వేతనాలకు ఈ రూ.62 కోట్లను వినియోగించనున్నారు. బుధవారం నుంచి ఉపాధి హామీ సిబ్బంది ఖాతాల్లోకి నగదు జమ చేయనున్నట్లు అధికారులు వెల్లడించారు.

Updated Date - May 07 , 2025 | 07:37 AM