Share News

Women's Safety: మహిళా పోలీ్‌సలు తక్కువే!

ABN , Publish Date - Feb 08 , 2025 | 02:20 AM

మహిళల భద్రతకు అత్యధిక ప్రాధాన్యం ఇస్తున్నామని సందర్భం వచ్చిన ప్రతిసారీ ప్రభుత్వం ప్రకటిస్తోంది. సమస్యల్లో ఉన్న వారికి అండగా నిలబడేందుకు మహిళా భద్రత విభాగం, భరోసా కేంద్రాల వంటివి ఉన్నాయని చెబుతోంది. అయితే, ఆయా విభాగాలు పనిచేస్తున్నా.. అవి ఆశించిన స్థాయిలో సమర్థంగా సేవలందించలేని పరిస్థితి. తమకు జరిగిన అన్యాయంపై బాధితులు మొదట పోలీస్‌ స్టేషన్‌కు వెళ్తుంటారు.

Women's Safety: మహిళా పోలీ్‌సలు తక్కువే!

తెలంగాణ పోలీస్‌ బలగం 76,292 మంది

అందులో అతివలు 4,782 మంది మాత్రమే

రాష్ట్రంలో మహిళలపై పెరుగుతున్న నేరాలు

ఠాణాల్లో మగ పోలీసులతో అన్నీ చెప్పలేని స్థితి

హైదరాబాద్‌, ఫిబ్రవరి 7 (ఆంధ్రజ్యోతి) : మహిళల భద్రతకు అత్యధిక ప్రాధాన్యం ఇస్తున్నామని సందర్భం వచ్చిన ప్రతిసారీ ప్రభుత్వం ప్రకటిస్తోంది. సమస్యల్లో ఉన్న వారికి అండగా నిలబడేందుకు మహిళా భద్రత విభాగం, భరోసా కేంద్రాల వంటివి ఉన్నాయని చెబుతోంది. అయితే, ఆయా విభాగాలు పనిచేస్తున్నా.. అవి ఆశించిన స్థాయిలో సమర్థంగా సేవలందించలేని పరిస్థితి. తమకు జరిగిన అన్యాయంపై బాధితులు మొదట పోలీస్‌ స్టేషన్‌కు వెళ్తుంటారు. అయితే అక్కడికి వెళ్లిన మహిళలు తమ బాధను సవివరంగా పోలీ్‌సలు వద్ద చెప్పుకునే పరిస్థితి లేదు. ఇందుకు ప్రధాన కారణం పోలీస్‌ శాఖలో మహిళా సిబ్బంది తక్కువగా ఉండటమే. ప్రతి పోలీస్‌ స్టేషన్‌లో మహిళా సిబ్బంది అందుబాటులో ఉంటున్నా.. వారి సంఖ్య అంతంతమాత్రంగానే ఉంది. సిబ్బంది కొరత, ఇతర కారణాల వల్ల చాలా చోట్ల రాత్రిళ్లు మహిళా పోలీ్‌సలు విధుల్లో ఉండటం లేదు. ఫలితంగా పోలీస్‌ స్టేషన్‌కు వెళ్లిన మహిళలు తమ సమస్యను పురుష పోలీ్‌సల వద్ద చెప్పుకోలేని పరిస్థితి. కొన్ని సందర్భాల్లో అవసరమైనప్పుడు అత్యవసరంగా మహిళా సిబ్బందిని పిలిపించాల్సి వస్తోంది. పోలీస్‌ శాఖలో మహిళా సిబ్బంది కొరతను అధిగమించేందుకు నియామకాల్లో 33ు రిజర్వేషన్‌ అమల్లోకి తెచ్చినా.. ఇప్పటికీ పూర్తిస్థాయిలో అవసరమైనంత మంది అందుబాటులో లేరు.

మహిళా అధికారులు సిబ్బంది ఇలా..

రాష్ట్ర పోలీస్‌ శాఖలో అన్ని విభాగాల్లో కలిపి మొత్తం 76,292 మంది అధికారులు, సిబ్బంది ఉన్నారు. అందులో మహిళా అధికారులు, సిబ్బంది 4,782 మంది మాత్రమే. వీరిలో ఎస్పీ నుంచి డీజీ స్థాయి వరకు 67 మంది, కానిస్టేబుల్‌ నుంచి డీఎస్పీ వరకు 3,642 మంది, సాయుధ విభాగం(ఏఆర్‌)లో 1,073 మంది మహిళలు ఉన్నారు. వీరితోపాటు 868 మంది మహిళలు హోంగార్డులుగా ఉన్నారు.

ఎక్కడికక్కడ ఇబ్బందులే...

మహిళా సిబ్బంది కొరత వల్ల పోలీసింగ్‌లో అనేక ఇబ్బందులు ఎదురవుతున్నాయి. ఆందోళనలు, నిరసనల సమయంలో మహిళలను అదుపు చేయడం, అదుపులోకి తీసుకోవడం కష్టతరంగా మారుతోంది. నిబంధనల ప్రకారం మహిళలను అదుపులోకి తీసుకోవాలన్నా, అరెస్ట్‌ చేయాలన్నా, స్టేషన్‌లో విచారించాలన్నా.. మహిళా సిబ్బంది ఉండాల్సిందే. కానీ సిబ్బంది కొరత వల్ల కొన్ని సందర్భాల్లో ఠాణాల్లోనూ ఇబ్బందికర పరిస్థితులు ఎదురవుతున్నాయి. కొన్నిసార్లు ఆందోళనల సమయంలో పురుష పోలీస్‌ సిబ్బందే మహిళా ఆందోళనకారులను అదుపులోకి తీసుకోవాల్సి వస్తోంది. దీంతో అనుకోని పరిస్థితులు ఎదురైనప్పుడు పోలీస్‌ శాఖ విమర్శలు ఎదుర్కోవాల్సి వస్తోంది.


మహిళలపై పెరుగుతున్న నేరాలు..

మహిళలు, చిన్నారుల భద్రతకు ఎన్ని చర్యలు తీసుకుంటున్నా.. ఏటా వారిపై జరుగుతున్న నేరాలకు సంబంధించిన కేసులు పెరుగుతున్నాయి. 2023లో రాష్ట్రవ్యాప్తంగా మహిళలపై 19,013 కేసులు నమోదు కాగా.. 2024లో ఆ సంఖ్య 19,922కు పెరిగింది. గృహహింస, వరకట్న వేధింపులు, అత్యాచారం కేసులు ఆందోళనకర స్థాయిలో ఉన్నాయి. మిస్సింగ్‌ కేసుల్లో 2023తో పోలిస్తే 2024లో 18ు పెరుగుదల నమోదైంది. ఇలా ప్రతి సంవత్సరం మహిళలపై జరుగుతున్న నేరాల సంఖ్యలో పెరుగుదల నమోదవుతుండగా.. బాధితులకు అవసరమైన స్థాయిలో సహాయం అందించేందుకు వీలుగా మహిళా పోలీస్‌ సిబ్బంది లేరు.

నియోజకవర్గాల్లోనూ మహిళా పోలీస్‌ స్టేషన్లు ఉండాలి..

జిల్లా కేంద్రాల్లోనే కాకుండా ప్రతి నియోజకవర్గ పరిధిలో మహిళా పోలీస్‌ స్టేషన్‌ ఏర్పాటు చేయాలని యూత్‌ ఫర్‌ యాంటీ కరప్షన్‌ ఫౌండర్‌ రాజేంద్ర పల్నాటి డిమాండ్‌ చేశారు. రాష్ట్రంలో పెరిగిన మహిళల జనాభాకు అనుగుణంగా మహిళా పోలీస్‌ సిబ్బంది లేరని చెప్పారు. చాలా మంది యువతులు, మహిళలు మగ పోలీ్‌సల వద్ద అన్ని విషయాలు చెప్పుకోలేని పరిస్థితి ఉందని పేర్కొన్నారు. మహిళలు స్టేషన్‌కు వచ్చినప్పుడు మహిళా పోలీ్‌సలు వారికి ధైర్యం చెప్పి, అండగా నిలబడేలా పరిస్థితులు కల్పించాలని రాజేంద్ర పల్నాటి కోరారు.


ఇవి కూడా చదవండి..

Elephant Attack Video: దూసుకొస్తున్న ఏనుగును చూసి రెండస్థుల పైకి ఎక్కేసిన జనం.. చివరకు జరిగింది చూస్తే..

Viral Video: ఇల్లు మారుతూ మనసూ గెలుచుకున్నారుగా.. ఆటో వెనుక చూడగా.. గుండెలకు హత్తుకునే సీన్..

Viral Video: కళ్లెదుటే పులి వేట.. కుక్కను ఎలా వేటాడిందో చూస్తే..

Viral Video: చీకట్లో సైకిల్‌పై వెళ్తున్న యువతి.. వెనుక కారు యజమాని నిర్వాకంతో సడన్‌గా..

Viral Video: కంటతడి పెట్టించిన కోబ్రా.. చనిపోయిన పాము పక్కన పడగ విప్పి మరీ..

Viral Video: పాక శాస్త్రంలో చేయి తిరగడమంటే ఇదేనేమో.. వంట ఎలా చేస్తున్నాడో చూస్తే..

మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Updated Date - Feb 08 , 2025 | 02:20 AM