Retired Army Jawans Shop: కుషాయిగూడలో రిటైర్డ్ ఆర్మీ జవాన్ షాపులో దోపిడీకి యత్నం..
ABN , Publish Date - Nov 01 , 2025 | 06:24 PM
రిటైర్డ్ ఆర్మీ జవాన్ షాపులో శుక్రవారం దొంగతనం జరిగింది. ఓ దొంగ షాపులోకి కత్తితో ప్రవేశించాడు. షాపు యజమానిపై కత్తితో దాడి చేసి క్యాష్ బ్యాగ్ లాక్కెళ్లిపోయాడు.
ఓ దొంగ రిటైర్డ్ ఆర్మీ జవాన్ షాపులో దోపిడీకి యత్నించాడు. షాపులోకి చొరబడి రెండు లక్షల నగదు ఉన్న క్యాష్ బ్యాగ్ లాక్కొని బయటకు పరుగులు తీశాడు. ఆ జవాన్ ఎంతో వేగంగా స్పందించాడు. దొంగ వెంటపడి మరీ పట్టుకున్నాడు. క్యాష్ బ్యాగు తీసుకుని, దొంగను పోలీసులకు అప్పగించాడు. ఈ సంఘటనకు సంబంధించిన పూర్తి వివరాల్లోకి వెళితే.. రిటైర్డ్ ఆర్మీ జవాన్ శ్రీనివాస్ కుషాయిగూడలో మనీ ఎక్స్చేంజ్ కౌంటర్ నిర్వహిస్తున్నాడు.
శుక్రవారం రాత్రి 7 గంటలకు గుర్తు తెలియని దుండగుడు షాప్‌లోకి ప్రవేశించాడు. శ్రీనివాస్‌పై కత్తితో దాడి చేశాడు. షాప్‌లో ఉన్న రెండు లక్షల క్యాష్ బ్యాగ్‌ను లాక్కొని బయటికి పరుగులు తీశాడు. అయితే, శ్రీనివాస్ మాత్రం అతడ్ని వదిలిపెట్టలేదు. వెంటాడి మరీ పట్టుకున్నాడు. తన క్యాష్ బ్యాగును స్వాధీనం చేసుకున్నాడు. తర్వాత దొంగను పోలీసులకు అప్పగించాడు. ఈ సంఘటనకు సంబంధించిన దృశ్యాలు షాపులోని సీసీటీవీ కెమెరాల్లో రికార్డు అయ్యాయి.
పోలీసులు ఆ దొంగను యూఎస్ సిటీజెన్‌గా గుర్తించారు. సంఘటన నిన్న రాత్రి జరిగినా పోలీసులు ఇప్పటి వరకు అతడిపై కేసు నమోదు చేయలేదని తెలుస్తోంది. ఇక, ఈ దాడి నేపథ్యంలో స్థానిక ప్రజల్లో భయం నెలకొంది.
ఇవి కూడా చదవండి
ఇండిగో విమానానికి బాంబు బెదిరింపులు.. ఎయిర్‌పోర్టులో ల్యాండ్ అవ్వకుండానే..
ఇంట్లో పండ్లు, కూరగాయలు తాజాగా ఉండాలంటే ఇలా చేయండి.!