పెరిగిన రిజిస్ర్టేషన్‌శాఖ ఆదాయం
ABN , Publish Date - Jun 19 , 2025 | 03:24 AM
గత ఆర్ధిక సంవత్సరంతో పోల్చితే ఈసారి తొలి 2 నెలల్లో రిజిస్ర్టేషన్ శాఖ ఆదాయం పెరిగింది. దస్తావేజుల సంఖ్య కూడా పెరిగింది. ఆర్థిక సంవత్సరం ప్రారంభమైన తొలి 2 నెలల్లోనే 3.04 లక్షల దస్తావేజులు రిజిస్ర్టేషన్ కాగా రూ.2574.58 కోట్ల ఆదాయం సమకూరింది.
ఏప్రిల్, మే లో 3 లక్షల దస్తావేజుల రిజిస్ర్టేషన్
గత ఆర్ధిక సంవత్సరం తొలి 2 నెలల్లో 2.74 లక్షల దస్తావేజులు రిజిస్టర్
హైదరాబాద్, జూన్ 18(ఆంధ్రజ్యోతి): గత ఆర్ధిక సంవత్సరంతో పోల్చితే ఈసారి తొలి 2 నెలల్లో రిజిస్ర్టేషన్ శాఖ ఆదాయం పెరిగింది. దస్తావేజుల సంఖ్య కూడా పెరిగింది. ఆర్థిక సంవత్సరం ప్రారంభమైన తొలి 2 నెలల్లోనే 3.04 లక్షల దస్తావేజులు రిజిస్ర్టేషన్ కాగా రూ.2574.58 కోట్ల ఆదాయం సమకూరింది. 2024-25 ఆర్థిక సంవత్సరంలో ఏప్రిల్, మే నెలలో 2.74 లక్షల దస్తావేజులు రిజిస్టర్ అయ్యాయి. 2024-25 ఏడాదిలో తొలి 2 నెలలకుగాను రూ.2,194.53 కోట్లు ఆదాయం వచ్చింది. వ్యవసాయ క్రయవిక్రయాలు ఈ ఏడాది పెరిగాయి. 2024-25 ఏడాదిలో ఏప్రిల్ నెలలో 37,623 వ్యవసాయ దస్తావేజులు రిజిస్టర్ కాగా ఈ ఏడాది ఏప్రిల్ నెలలో ఈసంఖ్య 42,543 పెరిగింది. వ్యవసాయేతర క్రయ విక్రయాల్లో గత ఏడాది ఏప్రిల్ నెలలో 86,534 దస్తావేజులు రిజిస్టర్ కాగా, ఈ ఏడాది 100369 రిజిస్టర్ అయ్యాయి.
భూముల విలువలు పెరుగుతాయని..
రాష్ట్ర వ్యాప్తంగా అమల్లోకి వచ్చిన స్లాట్ బుకింగ్ విధానం రిజిస్ర్టేషన్లు పెరగడానికి ఒక కారణంగా అధికారులు భావిస్తున్నారు. మొదటి దశలో 22 సబ్ రిజిస్టార్ కార్యాలయాల్లో ఏప్రిల్ 10 నుంచి జూన్ 1 వరకు స్లాట్ బుకింగ్ అమలు చేయగా 30,592 దస్తావేజులు రిజిస్టర్ అయ్యాయి. రెండో దశలో మే 12 నుంచి 25 సబ్‌రిజిస్టార్ కార్యాలయాల్లో అమల్లోకి తేవడంతో 14099 దస్తావేజులు రిజిస్టర్ అయ్యాయి. త్వరలో భూముల విలువలు పెరుగుతాయనే ప్రచారం కూడా జరుగుతుండటంతో క్రయ విక్రయాలు పెరిగాయని రిజిస్ర్టేషన్ శాఖ అంచనా వేస్తోంది.
మోడల్ గోశాలల నిర్ణయాన్ని స్వాగతిస్తున్నా: రాజాసింగ్
కాగితాలకే పరిమితం కాకూడదు : వీహెచ్‌పీ
హైదరాబాద్ సిటీ, జూన్ 18 (ఆంధ్రజ్యోతి) : రాష్ట్రంలో నాలుగు మోడల్ గోశాలలు నిర్మించాలనే నిర్ణయాన్ని స్వాగతిస్తున్నట్లు బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్ తెలిపారు. అందుకు విధివిధానాలపై కమిటీని వేసేందుకు నిర్ణయం తీసుకున్న సీఎం రేవంత్‌రెడ్డికి ధన్యవాదాలు తెలిపారు. తెలంగాణలో ఆవులు, దూడలను వేలసంఖ్యలో వధ శాలల్లో అక్రమంగా చంపుతున్నారని, నివారించేందుకు కార్యాచరణ ప్రణాళికరూపొందించాలని కోరారు. రాష్ట్రంలో గో రక్షణకు ఒక స్పెషల్ పోలీస్ టాస్క్‌ఫోర్స్ ఏర్పాటు చేయాలని, అందులో సభ్యునిగా తనకు అవకాశం కల్పించాలని కోరారు. గో సంరక్షణకు సీఎం రేవంత్ తీసుకున్న నిర్ణయం పట్ల విశ్వహిందూ పరిషత్ హర్షం వ్యక్తంచేసింది. ఈమేరకు వీహెచ్‌పీ తెలంగాణ ప్రచార ప్రముఖ్ పగుడాకుల బాలస్వామి తదితరులు ఓ ప్రకటన విడుదల చేశారు. అయితే ఇది ఆచరణ రూపం దాల్చాలని సూచించారు.