Share News

Congress Leader CM Revanth Reddy: ఆ పార్టీలు ముస్లింలరిజర్వేషన్‌ను ఎత్తేస్తాయ్‌

ABN , Publish Date - Nov 06 , 2025 | 02:36 AM

కాంగ్రె్‌సకు హిందూ, ముస్లిం మతాలు రెండూ.. రెండు కళ్ల లాంటివని, తాము దేనినీ తక్కువ చేయబోమని సీఎం రేవంత్‌రెడ్డి అన్నారు...

Congress Leader CM Revanth Reddy: ఆ పార్టీలు ముస్లింలరిజర్వేషన్‌ను ఎత్తేస్తాయ్‌

  • బీజేపీ, బీఆర్‌ఎస్‌ కలిసే ప్రయత్నం చేస్తున్నాయి

  • హిందూ, ముస్లిం.. కాంగ్రె్‌సకు రెండు కళ్లు

  • కిషన్‌రెడ్డి నాకు సవాళ్లు విసరడం కాదు..కేసీఆర్‌, కేటీఆర్‌ల అరెస్టుకు ఢిల్లీలో కొట్లాడాలి

  • జూబ్లీహిల్స్‌లో బీజేపీకి డిపాజిట్‌ తెప్పించగలరా?

  • సవాల్‌ చేసి పారిపోవడం కేటీఆర్‌కు అలవాటే

  • బీఆర్‌ఎస్‌, బీజేపీల వల్లే జూబ్లీహిల్స్‌లో సమస్యలు

  • ఉప ఎన్నిక ప్రచార రోడ్‌ షోలో సీఎం రేవంత్‌

  • కారు గుర్తుకు ఓటువేస్తే కమలానికి వేసినట్లే

  • మోదీకి మద్దతిస్తున్న కేసీఆర్‌ ప్రమాదకరం

  • క్రైస్తవ సంఘాల సమావేశంలో ముఖ్యమంత్రి

హైదరాబాద్‌ సిటీ/యూసు్‌ఫగూడ/హైదరాబాద్‌, నవంబరు 5 (ఆంధ్రజ్యోతి): కాంగ్రె్‌సకు హిందూ, ముస్లిం మతాలు రెండూ.. రెండు కళ్ల లాంటివని, తాము దేనినీ తక్కువ చేయబోమని సీఎం రేవంత్‌రెడ్డి అన్నారు. ముస్లింలకు 4 శాతం రిజర్వేషన్‌ను వైఎస్‌ రాజశేఖర్‌రెడ్డి హయాంలో కాంగ్రెస్‌ ప్రభుత్వం కల్పించిందని గుర్తు చేశారు. అయితే బీఆర్‌ఎస్‌, బీజేపీ ఆ రిజర్వేషన్‌ను ఎత్తేయాలని చూస్తున్నాయని ఆరోపించారు. ముస్లింల రిజర్వేషన్‌ను 12 శాతానికి పెంచుతామన్న కేసీఆర్‌.. పదేళ్లలో ఎందుకు పెంచలేదని ప్రశ్నించారు. జూబ్లీహిల్స్‌ ఉప ఎన్నిక ప్రచారంలో భాగంగా బుధవారం రాత్రి కాంగ్రెస్‌ అభ్యర్థి నవీన్‌యాదవ్‌తో కలిసి షేక్‌పేట డివిజన్‌లోని పారామౌంట్‌ కాలనీ గేట్‌-3 నుంచి గేట్‌-2, గేట్‌-1 మీదుగా బృందావన్‌ కాలనీ వరకు, యూసు్‌ఫగూడలో వెంకటగిరి నుంచి కృష్ణానగర్‌ మీదుగా యూస్‌ఫగూడ చెక్‌ ఫోస్టు వరకు సీఎం రేవంత్‌ రెడ్డి రోడ్‌షో నిర్వహించారు.ఈ సందర్భంగా ఆయా ప్రాంతాల్లో కార్నర్‌ మీటింగ్‌లలో మాట్లాడారు. ‘‘కాళేశ్వరం ప్రాజెక్టులోఅవినీతికి సంబంధించి కేసీఆర్‌పై సీబీఐ కేసెందుకు పెట్టలేదని సవాల్‌ విసిరితే.. కిషన్‌రెడ్డి నాకు సవాల్‌ విసరుతున్నారు. నాతో చర్చలు జరపడం కాదు.. ఢిల్లీకి వెళ్లి మోదీ, అమిత్‌షాతో చర్చించండి. కేసీఆర్‌, కేటీఆర్‌ అరెస్టుకు ఎందుకు అనుమతించడంలేదని కొట్లాడండి’’ అని రేవంత్‌ ధ్వజమెత్తారు.


జూబ్లీహిల్స్‌లో డిపాజిట్‌ తెచ్చుకుంటవా?

కిషన్‌రెడ్డి భయపెడితే భయపడడానికి చిన్న పిల్లలు ఎవరూ లేరని సీఎం రేవంత్‌ అన్నారు. ‘‘చాలా మందిని చూశాం. నియంతలా నీల్గిన కేసీఆర్‌ను కాంగ్రెస్‌ కార్యకర్తలు బండకేసి కొడితే ఫామ్‌హౌజ్‌లో పండుకుండు. జూబ్లీహిల్స్‌లో డిపాజిట్‌ తెచ్చుకుంటవా? డిపాజిట్‌ తెచ్చుకుంటే నువ్వు గెలిచినట్లే..! డిపాజిట్లు రాని నియోజకర్గంలో పర్యటనలు చేస్తూ బీఆర్‌ఎ్‌సను గెలిపించేందుకు కృషి చేస్తున్నావు. పార్టీని తాకట్టు పెట్టి కేసీఆర్‌ను కాపాడటం కాదు. కేసీఆర్‌, హరీ్‌షరావు, కేటీఆర్‌లను ఎప్పటి వరకు బొక్కలో వేస్తావో చెప్పి జూబ్లీహిల్స్‌లో ఓట్లు అడగాలి’’ అని సవాల్‌ చేశారు. కేటీఆర్‌ చర్చలకు సవాల్‌ అంటున్నారని, సవాల్‌ విసరడం, పారిపోవడం ఆయన జాతిలోనే ఉందని రేవంత్‌రెడ్డి వ్యాఖ్యానించారు. కంటోన్మెంట్‌లో రూ.5 వేల కోట్ల అభివృద్ధికి సంబంధించి ఎమ్మెల్యే శ్రీగణేశ్‌ జీవోలు చూపిస్తే రాజీనామా చేయకుండా కేటీఆర్‌ పారిపోయారని ధ్వజమెత్తారు. సన్నాసులు సవాల్‌ విసిరితే కాంగ్రెస్‌ కార్యకర్తలు పట్టించుకోరన్నారు. జూబ్లీహిల్స్‌ డివిజన్లలో ఉన్న చెత్త, తాగునీటి సమస్య, ఇండ్లపై విద్యుత్‌ తీగల సమస్యలకు బీజీపీ, బీఆర్‌ఎస్సే కారణమని ఆరోపించారు. 2014 నుంచి బీఆర్‌ఎస్‌ ప్రభుత్వమే ఉందని, ఎంపీగా బీజేపీ నేతను గెలిపించారని, తమకు అవకాశం రాలేదని గుర్తు చేశారు. ప్రస్తుతం రూ.400 కోట్లతో అభివృద్ధి పనులు చేపడుతున్నామని తెలిపారు.

డబుల్‌ ఇళ్ల పేరుతో కేసీఆర్‌ మోసం..

డబుల్‌ బెడ్‌రూం ఇళ్లు ఇస్తానని చెప్పి కేసీఆర్‌ మోసం చేశారని సీఎం రేవంత్‌ ఆరోపించారు. తాము రాబోయే రోజుల్లో జూబ్లీహిల్స్‌కు 4వేల ఇందిరమ్మ ఇళ్లు కేటాయిస్తామని హామీ ఇచ్చారు. కేసీఆర్‌, కేటీఆర్‌ ముస్లింలను తపుదోవ పట్టిస్తున్నారని మండిపడ్డారు. అజారుద్దీన్‌కు మంత్రి పదవి ఇస్తే వీళ్లకు వచ్చే సమస్య ఏమిటని ప్రశ్నించారు. మోదీ, అమిత్‌షా వచ్చి అడ్డుకున్నా మైనార్టీలకు పదవులు ఇస్తామన్నారు. పదేళ్లు సీఎంగా ఉన్న కేసీఆర్‌ ఏనాడూ సినీ కార్మికుల సమస్యలను పట్టించుకోలేదని ధ్వజమెత్తారు. కృష్ణానగర్‌ అండర్‌ గ్రౌండ్‌ డ్రైనేజీ, సినీ కార్మికుల పిల్లలు, జీవితాల గురించి కేసీఆర్‌, కేటీఆర్‌ మాట్లాడలేదని విమర్శించారు. తాము అధికారంలోకి వచ్చాక 24 క్రాఫ్టుల సినీ సంఘాలను ఇంటికి పిలిచి మాట్లాడానని, గద్దర్‌ అవార్డులు ఇస్తున్నామని గుర్తు చేశారు. నవీన్‌ యాదవ్‌ 30 వేల మెజారిటీతో గెలుస్తారని, షేక్‌పేట నుంచే 15 వేల మెజారిటీ వస్తుందని అన్నారు. రోడ్‌షోలో మంత్రులు వివేక్‌, అజారుద్దీన్‌, తుమ్మల నాగేశ్వరరావు, ఉత్తమ్‌కుమార్‌రెడ్డి, పొన్నం ప్రభాకర్‌, కొండా సురేఖ, టీపీసీసీ చీఫ్‌ మహే్‌షకుమార్‌గౌడ్‌, ఎంపీ అనిల్‌కుమార్‌ యాదవ్‌, ఎంఐఎం ఎమ్మెల్యే కౌసర్‌ మెయినుద్దీన్‌ పాల్గొన్నారు.


బీజేపీ తాకట్టులో బీఆర్‌ఎస్‌!

బీఆర్‌ఎస్‌ అధ్యక్షుడు కేసీఆర్‌.. ఆ పార్టీని బీజేపీకి తాకట్టు పెట్టారని సీఎం రేవంత్‌రెడ్డి ఆరోపించారు. అందుకే.. కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణంలో అవినీతి, అక్రమాల కేసును సీబీఐకి అప్పగించి మూడు నెలలు గడిచినా కేంద్రం ఇంతవరకూ స్పందించలేదన్నారు. ఫార్ములా-ఈ కార్‌ రేసు కేసులో కేటీఆర్‌ను ప్రాసిక్యూట్‌ చేసేందుకు గవర్నర్‌ను అనుమతి కోరితే కూడా ఇంతవరకూ ఇవ్వలేదన్నారు. బీజేపీ, బీఆర్‌ఎ్‌సల మధ్య రాజకీయ ఒప్పందమే లేకుంటే గవర్నర్‌ అనుమతి ఎందుకు ఇవ్వడంలేదని ప్రశ్నించారు. ప్రధాని మోదీకి మద్దతు ఇస్తున్న కేసీఆర్‌.. ప్రమాదకరమని, జూబ్లీహిల్స్‌ ఉప ఎన్నికలో కారు గుర్తుకు ఓటువేస్తే కమలానికి వేసినట్లేనని అన్నారు. బుధవారం జూబ్లీహిల్స్‌ నియోజకవర్గానికి చెందిన పలు క్రైస్తవ సంఘాల ప్రతినిధులు, పాస్టర్లు సీఎం రేవంత్‌రెడ్డిని ఆయన నివాసంలో కలిశారు. ఉప ఎన్నికలో కాంగ్రెస్‌ పార్టీకి మద్దతు ప్రకటించారు. ఇదిలా ఉండగా.. ఎర్రగడ్డకు చెందిన బీఆర్‌ఎస్‌ సీనియర్‌ నాయకుడు షరీఫ్‌ ఖురేషీ బుధవారం సీఎం రేవంత్‌రెడ్డి సమక్షంలో కాంగ్రెస్‌ పార్టీలో చేరారు.

Updated Date - Nov 06 , 2025 | 05:57 AM