Cyber Fraud Hyderabad: మనీ లాండరింగ్ పేరుతో కుచ్చుటోపీ
ABN , Publish Date - Jul 19 , 2025 | 04:45 AM
సైబర్ మోసగాళ్లు రోజుకో ఎత్తుగడ వేస్తూ అమాయకుల నుంచి డబ్బు స్వాహా చేస్తున్నారు. హైదరాబాద్‌లోని లాలాగూడ ప్రాంత వాసి- రిటైర్డు ఉద్యోగికి సైబర్ మోసగాడు గత నెల 23న ఫోన్ చేసి తాను
రిటైర్డు ఉద్యోగి నుంచి 32 లక్షలు కాజేసిన సైబర్ మోసగాడు
హైదరాబాద్ సిటీ, జూలై 18 (ఆంధ్రజ్యోతి): సైబర్ మోసగాళ్లు రోజుకో ఎత్తుగడ వేస్తూ అమాయకుల నుంచి డబ్బు స్వాహా చేస్తున్నారు. హైదరాబాద్‌లోని లాలాగూడ ప్రాంత వాసి- రిటైర్డు ఉద్యోగికి సైబర్ మోసగాడు గత నెల 23న ఫోన్ చేసి తాను ఈడీ అధికారినని పరిచయం చేసుకుని.. ‘మీపై మనీ లాండరింగ్ కేసు నమోదైంది. సహకరించకుంటే మీ భార్యాభర్తలను అరెస్టు చేసి, ముంబై తీసుకెళ్లి విచారించాల్సి వస్తుంది’ అని బెదిరించాడు. విచారణ పూర్తయ్యే వరకూ ఎవరికీ ఈ విషయం చెప్పొద్దని, చెప్పినట్లు తెలిస్తే ఏ క్షణంలోనైనా అరెస్టు చేస్తామని బెదిరించాడు.
తనకు మనీ లాండరింగ్ కేసులతో సంబంధం లేదని బాధితుడు మొత్తుకున్నా వినలేదు. ‘మీతోపాటు మీ భార్యను అరెస్టు చేస్తామని హెచ్చరించడంతో భయపడిపోయి వృద్ధుడు పలు దఫాలుగా రూ.32.20 లక్షల నగదు ఆ సైబర్ నేరగాడు సూచించిన బ్యాంకు ఖాతాల్లో జమ చేశాడు. చివరికి మోసపోయినట్లు గ్రహించిన వృద్ధుడు సైబర్ క్రైం పోలీసు స్టేషన్‌లో ఫిర్యాదు చేశాడు.