బహుముఖ ప్రజ్ఞాశాలి సురవరం ప్రతాపరెడ్డి
ABN , First Publish Date - 2025-05-29T03:48:57+05:30 IST
ప్రముఖ కవి, రచయిత, సంపాదకులు, సామాజికవేత్త సురవరం ప్రతాపరెడ్డి బహుముఖ ప్రజ్ఞాశాలి అని, తెలంగాణ పోరాటం..
రాష్ట్ర ప్రణాళికా సంఘం వైస్‌చైర్మన్ జి.చిన్నారెడ్డి
తెలుగు యూనివర్సిటీ నూతన లోగో ఆవిష్కరణ
హైదరాబాద్, మే 28 (ఆంధ్రజ్యోతి) : ప్రముఖ కవి, రచయిత, సంపాదకులు, సామాజికవేత్త సురవరం ప్రతాపరెడ్డి బహుముఖ ప్రజ్ఞాశాలి అని, తెలంగాణ పోరాటం, సామాజిక స్ఫూర్తి ప్రదాత అని, అలాంటి గొప్ప వ్యక్తి పేరు తెలుగు యూనివర్సిటీకి పెట్టడం హర్షణీయమని రాష్ట్ర ప్రణాళికా మండలి వైస్‌చైర్మన్ డా.జి.చిన్నారెడ్డి అన్నారు.
సురవరం ప్రతాపరెడ్డి తెలుగు విశ్వవిద్యాలయం ఆడిటోరియంలో బుధవారం జరిగిన సురవరం ప్రతాపరెడ్డి 129వ జయంతి కార్యక్రమంలో చిన్నారెడ్డి మాట్లాడుతూ.. సురవరం ప్రతాపరెడ్డి పేరు ఉమ్మడి రాష్ట్రంలోనే తెలుగు యూనివర్సిటీకి పెట్టాల్సిందన్నారు. సురవరం ప్రతాపరెడ్డి తెలుగు యూనివర్సిటీ నూతన లోగోను చిన్నారెడ్డి ఆవిష్కరించారు.