Share News

Chili Market: ఖమ్మం మార్కెట్‌కు పోటెత్తిన ఎర్రబంగారం

ABN , Publish Date - Feb 25 , 2025 | 05:19 AM

మార్కెట్లలో ఎటు చూసిన మిరప బస్తాలే కనిపించాయి. సోమవారం సుమారు లక్షా 20 వేల మిర్చి బస్తాలు ఖమ్మం మార్కెట్‌కు రాగా, వరంగల్‌ ఎనుమాముల మార్కెట్‌కు 80 వేల మిర్చి బస్తాలు వచ్చాయి.

 Chili Market: ఖమ్మం మార్కెట్‌కు పోటెత్తిన ఎర్రబంగారం

వరంగల్‌ వ్యవసాయం, ఖమ్మం మార్కెట్‌, ఫిబ్రవరి 24(ఆంధ్రజ్యోతి): ఖమ్మం, వరంగల్‌ ఎనుమాముల వ్యవసాయ మార్కెట్‌లకు ఎర్ర బంగారం పోటెత్తింది. మార్కెట్లలో ఎటు చూసిన మిరప బస్తాలే కనిపించాయి. సోమవారం సుమారు లక్షా 20 వేల మిర్చి బస్తాలు ఖమ్మం మార్కెట్‌కు రాగా, వరంగల్‌ ఎనుమాముల మార్కెట్‌కు 80 వేల మిర్చి బస్తాలు వచ్చాయి. వానాకాలం(ఖరీ్‌ఫ)మిర్చి సీజన్‌ ప్రారంభమైన తరువాత ఇంత భారీ మొత్తంలో పంట మార్కెట్లకు రావడం ఇదే తొలిసారి. మిర్చి యార్డులకు శని, ఆదివారాలు సెలవులు రావడంతో రైతులు సోమవారం పెద్దమొత్తంలో మిర్చి పంటను మార్కెట్‌లకు తీసుకొచ్చారు. సోమవారం ఉదయం 6 గంటలకే ఖమ్మం మార్కెట్‌ యార్డులు పూర్తిగా నిండిపోయాయి. ఖమ్మం మార్కెట్లో క్వింటాలు మిర్చిని కనిష్ఠంగా రూ.10,000 నుంచి గరిష్ఠంగా రూ.13,800 వరకు కొనుగోలు చేశారు. వరంగల్‌ మార్కెట్‌లో క్వింటా మిర్చి ధర గరిష్ఠంగా రూ.13 వేలు, కనిష్ఠంగా రూ.7500గా నిర్ణయించారు. పెద్దమొత్తంలో మిర్చి రావడంతో వ్యాపారులు సిండికేట్‌ అయి మిర్చి రేటు తగ్గించారు.


ఇవి కూడా చదవండి...

CM Revanth Reddy: సొల్లు మాటలు వద్దు.. ఆధారాలతో చూపించండి

Telangana: మేడిగడ్డ వ్యవహారం.. కేసీఆర్‌ పిటిషన్‌పై తీర్పు రిజర్వ్..

TGSRTC: భక్తులకు గుడ్ న్యూస్ చెప్పిన టీజీఎస్‌ఆర్టీసీ.. ఆరోజు ఏకంగా 3 వేల బస్సులు..

Read Latest Telangana News And Telugu News

Updated Date - Feb 25 , 2025 | 05:19 AM