ఫిట్స్‌తో యువ రైతుమృతి
ABN , Publish Date - Jan 22 , 2025 | 12:07 AM
పొలం చదును చేస్తుండగా ఓ యువ రైతు ఫిట్స్ రావడంతో మృతి చెందాడు. ఈ ఘటన తాండూరు మండలం చెంగోల్‌లో చోటుచేసుకుంది.
తాండూరు రూరల్, జనవరి 21, (ఆంధ్రజ్యోతి): పొలం చదును చేస్తుండగా ఓ యువ రైతు ఫిట్స్ రావడంతో మృతి చెందాడు. ఈ ఘటన తాండూరు మండలం చెంగోల్‌లో చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళ్తే.. గ్రామానికి చెందిన సాతమొల్ల అనిల్(28)కు రెండు కరాల భూమి ఉంది. అట్టి భూమిలో వరిపంట వేసుకునేందుకు అనిల్ భూమిచదును చేస్తున్నాడు. ఈ క్రమంలో అనిల్‌కు ఒక్కసారిగా ఫిట్స్ రావడంతో బురదలో కూరుకుపోయాడు. పొలం వద్ద ఎవరూ లేకపోవడంతో అనిల్‌ను ఎవరూ గుర్తించలేదు. కుటుంబ సభ్యులు పొలానికి చేరుకుని అపస్మారక స్థితిలో ఉన్న అనిల్‌ను తాండూరులోని ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. అప్పటికే రైతు మృతిచెందినట్లు వైద్యులు గుర్తించారు. మృతుడికి భార్య భారతి, కూతురు, కుమారుడు ఉన్నారు. అనిల్ కుటుంబాన్ని ప్రభుత్వం ఆదుకోవాలని గ్రామస్తులు కోరారు.