Share News

నానక్‌నగర్‌ అభివృద్ధికి కృషి : మల్‌రెడ్డి

ABN , Publish Date - Jan 06 , 2025 | 12:34 AM

నానక్‌నగర్‌ గ్రామాన్ని అన్నివిధాలా అభివృద్ధి చేయడానికి తాను రాజకీయాలకతీతంగా నిధులు తీసుకొస్తానని, గ్రామంలో పెద్దిరాజు పెద్దమ్మ ఆలయ నిర్మాణానికి సహకరిస్తానని ఇబ్రహీంపట్నం ఎమ్మెల్యే మల్‌రెడ్డి రంగారెడ్డి తెలిపారు.

నానక్‌నగర్‌ అభివృద్ధికి కృషి : మల్‌రెడ్డి

యాచారం, జనవరి 5(ఆంధ్రజ్యోతి): నానక్‌నగర్‌ గ్రామాన్ని అన్నివిధాలా అభివృద్ధి చేయడానికి తాను రాజకీయాలకతీతంగా నిధులు తీసుకొస్తానని, గ్రామంలో పెద్దిరాజు పెద్దమ్మ ఆలయ నిర్మాణానికి సహకరిస్తానని ఇబ్రహీంపట్నం ఎమ్మెల్యే మల్‌రెడ్డి రంగారెడ్డి తెలిపారు. ఆదివారం మండలంలోని నానక్‌నగర్‌కు చెందిన యాదవ కులస్తులతో పాటు పలువురు గ్రామస్తులు నగరంలో ఎమ్మెల్యేను ఆయన నివాసంలో కలిసి సమస్యలు వివరించడంతో పాటు ఆలయ నిర్మాణం విషయం ఎమ్మెల్యే దృష్టికి తీసుకెళ్లారు. ఆయన టీజీఐఐసీ అధికారులతో మాట్లాడి భూమి కేటాయించేందుకు కృషి చేస్తానని చెప్పారు. సర్వేనెంబర్‌ 213లో స్థలం ఉందని.. పాత ఆలయం కూడా అదేభూమిలో ఉందని గ్రామస్తులు ఎమ్మెల్యేకు వివరించారు. గ్రామం నుంచి ఆలయం వరకు సీసీ రోడ్డు, తాగునీటి వసతి కల్పించనున్నట్లు ఎమ్మెల్యే హమీ ఇచ్చారు. బర్ల మల్లేష్‌, బైకని శ్రీశైలం, శివకుమార్‌, తదితరులున్నారు.

Updated Date - Jan 06 , 2025 | 12:34 AM