Share News

పేదల సంక్షేమానికి కృషి

ABN , Publish Date - Jan 16 , 2025 | 11:28 PM

ప్రతీ పేదవాడికి పక్కా ఇళ్లు మంజూరు చేస్తామని షాద్‌నగర్‌ ఎమ్మెల్యే వీర్లపల్లి శంకర్‌ అన్నారు. గురువారం నందిగామ మండల పరిధిలోని అంతిరెడ్డిగూడలో గృహలక్ష్మి సర్వేను పరిశీలించారు. కాంగ్రె స్‌ ప్రభుత్వం ఇచ్చిన హామీలన్నీ నెరవేర్చుతుందని, అందులో ఎలాంటి అనుమానం లేదని అన్నారు. ఇళ్ల మంజూరుకు ఎవరికీ డబ్బులు ఇవ్వద్దని సూచించారు.

పేదల సంక్షేమానికి కృషి

నందిగామ : అంతిరెడ్డిగూడలో నిర్వహించిన సర్వేలో ఎమ్మెల్యే శంకర్‌, అధికారులు

అర్హులందరికీ పక్కా ఇళ్లు

షాద్‌నగర్‌ ఎమ్మెల్యే వీర్లపల్లి శంకర్‌

నందిగామ, జనవరి 16(ఆంధ్రజ్యోతి): ప్రతీ పేదవాడికి పక్కా ఇళ్లు మంజూరు చేస్తామని షాద్‌నగర్‌ ఎమ్మెల్యే వీర్లపల్లి శంకర్‌ అన్నారు. గురువారం నందిగామ మండల పరిధిలోని అంతిరెడ్డిగూడలో గృహలక్ష్మి సర్వేను పరిశీలించారు. కాంగ్రె స్‌ ప్రభుత్వం ఇచ్చిన హామీలన్నీ నెరవేర్చుతుందని, అందులో ఎలాంటి అనుమానం లేదని అన్నారు. ఇళ్ల మంజూరుకు ఎవరికీ డబ్బులు ఇవ్వద్దని సూచించారు. ఈ సందర్భంగా గ్రామంలో జరుగుతున్న పలు అభివృద్ధి పనులను స్థానిక నాయకులతో కలిసి పరిశీలించారు. నాయకులు జంగ నర్సింలు, కుమార్‌గౌడ్‌, కొమ్ము కృష్ణ, చంద్రపాల్‌రెడ్డి, కావి కృష్ణ, దేపల్లి శంకరయ్యగౌడ్‌, దేపల్లి మల్లేష్‌, తుమ్మల నర్సింలు, మెక్కొండ రామస్వామి తదితరులు పాల్గొన్నారు. కాగా, నందిగామ మండలం చేగూర్‌ మాజీ సర్పంచ్‌ మాణెమ్మ గురువారం మృతిచెందడంతో ఎమ్మెల్యే శంకర్‌, ఎమ్మెల్సీ నవీన్‌ రెడ్డి, మాజీ ఎమ్మెల్యేలు ప్రతా్‌పరెడ్డి, అంజయ్యయాదవ్‌, జడ్పీటీసీ శ్యాంసుందర్‌రెడ్డి, జడ్పీవైస్‌ చైర్మన్‌ గణేష్‌, ఎంపీపీ శివశంకర్‌గౌడ్‌ నాయకులు ఆమె మృతదేహానికి నివాళులు అర్పించారు.

ఆమనగల్లు : రాంనుంతలలో రెవెన్యూ, వ్యవసాయ శాఖ అధికారులు ప్రభుత్వ ఆదేశానుసారం సర్వే నిర్వహించారు. సాగులో లేని భూములను పరిశీలించి నివేదికలు రూపొందించారు. తహాసీల్దార్‌ లలిత ఆధ్వర్యంలో గ్రామ పంచాయతీ పరిధిలో సాగు చేయని భూములు, వెంచర్లను, చిన్న పరిశ్రమలు ఉన్నవాటిని పరిశీలించారు. రెవెన్యూ గ్రామం, సర్వే నెంబర్‌ మ్యాప్‌లు, గూగుల్‌ మ్యాప్‌లతో పోల్చి వ్యవసాయ యోగ్యంకాని భూములను గుర్తించారు. కాగా, ప్రజా పాలనలో రేషన్‌ కార్డుల కోసం చేసుకున్న దరఖాస్తుల పరిశీలన కార్యక్రమాన్ని ఆమనగల్లు మున్సిపాలిటీలో ఇంటింటికీ వెళ్లి కమిషనర్‌ వసంత ఆధ్వర్యంలో వార్డు అధికారులు వివరాలు సేకరిస్తున్నారు.

కడ్తాల్‌ : చరికొండ, కడ్తాల్‌, మైసిగండిలో తహసీల్దార్‌ ముంతాజ్‌ పర్యటించారు. ఆయా గ్రామాల్లో సాగులో లేని భూములను పరిశీలించారు. రెండు టీంలుగా ఏర్పడి సర్వే చేపడుతున్నట్లు చెప్పారు. ఏవో శ్రీలత, రెవెన్యూ, వ్యవసాయ శాఖ సిబ్బంది తదితరులు ఉన్నారు.

తలకొండపల్లి : బదునాపూర్‌, రామకృష్ణాపురం, మెదక్‌పల్లి, లింగరావుపల్లి, గౌరిపల్లి గ్రామాల్లో తహసీల్దార్‌ నాగార్జున ఆధ్వర్యంలో రెండు టీంలుగా ఏర్పడి సాగులో లేని భూములను గుర్తించారు. ఆర్‌ఐలు మంజుల, శ్రవణ్‌, ఏవో రేణుక, అధికారులు తదితరులు పాల్గొన్నారు.

యాచారం : రెవెన్యూ సిబ్బంది, వ్యవసాయాధికారులు సాగుకు యోగ్యంగా లేని భూములను గుర్తించారు. మండలంలోని మేడిపల్లిలో 483.25 ఎకరాలు, నానక్‌నగర్‌లో 154.16 ఎకరాలు, తాటిపర్తిలో 382.23 ఎకరాలు, కుర్మిద్దలో 974.4 ఎకరాలలు బీఆర్‌ఎస్‌ ప్రభుత్వం నిషేదిత జాబితాలో పెట్టింది. వీటితో పాటు గ్రీన్‌ఫీల్డ్‌ రోడ్డు సేకరణకు 144.7 ఎకరాల భూమి, మరో 1238.25 ఎకరాల భూమిని రాష్ట్ర ప్రభుత్వం నిషేధిత జాబితాలో పెట్ట డంతో అవి సాగుకు యోగ్యంగా లేనివిగా పరిగణిస్తున్నామని అధికారులు చెప్పా రు. ఈ భూములతో పాటు యాచారం, చౌదర్‌పల్లి గ్రామాల్లో గురువారం సా యంత్రం వరకు మరో 120 ఎకరాలను సాగుకు యోగ్యంగానివిగా గుర్తించారు. యాచారంలో కడీలు వేసి ప్లాట్లుగా ఉన్నవాటిని తహసీల్దార్‌ అయ్య ప్ప, వ్యవసాయాధికారి సందీ్‌పకుమార్‌, ఆర్‌ఐలు సాగుకు యోగ్యంగాలేనివిగా తేల్చారు.

Updated Date - Jan 16 , 2025 | 11:28 PM