Share News

ఉపాధ్యాయులను గౌరవించే సంస్కృతి మనది

ABN , Publish Date - Jan 22 , 2025 | 12:10 AM

గురువులను గౌరవించే సంస్కృతి మనదని ప్రేరణాత్మక వక్త హనుమంత్‌రెడ్డి అన్నారు. తాండూరులో మంగళవారం రామకృష్ణ సేవా సమితి ఆఽధ్వర్యంలో జరిగిన జాతీయ యువజన దినోత్సవంలో ముఖ్య అతిథిగా పాల్గొని ప్రసంచారు.

ఉపాధ్యాయులను గౌరవించే సంస్కృతి మనది
ప్రసంగిస్తున్న వక్త హనుమంత్‌రెడ్డి

తాండూరు, జనవరి 21 (ఆంధ్రజ్యోతి): గురువులను గౌరవించే సంస్కృతి మనదని ప్రేరణాత్మక వక్త హనుమంత్‌రెడ్డి అన్నారు. తాండూరులో మంగళవారం రామకృష్ణ సేవా సమితి ఆఽధ్వర్యంలో జరిగిన జాతీయ యువజన దినోత్సవంలో ముఖ్య అతిథిగా పాల్గొని ప్రసంచారు. తల్లిద్రండులు గురువుల పట్ల గౌరవం కలిగి ఉండాలని, ఉన్నత విలువలతో మెలగాలని కోరారు. యువత స్వామి వివేకానందుడు, అంబేడ్కర్‌ను ఆదర్శంగా తీసుకోవాలని సూచించారు. స్వామి వివేకానంద జయంతి సందర్భంగా నిర్వహించిన వ్యాస రచన పోటీల్లో ప్రతిభ కనబర్చిన విద్యార్థులకు బహుమతులు ప్రదానం చేశారు.ఈ కార్యక్రమంలో రామకృష్ణ సేవా సమితి అధ్యక్షులు బాలకృష్ణ, ఆత్మీయ అతిథి కల్వ రవికుమార్‌, గౌరవ అధ్యక్షుడు బస్వరాజ్‌, ప్రోగ్రాం కన్వీనర్‌ కేవీఎం వెంకట్‌, జాతీయ ఉత్తమ ఉపాధ్యాయ అవార్డు గ్రహీత జనార్ధన్‌, పాల్గొన్నారు.

Updated Date - Jan 22 , 2025 | 12:10 AM