వివేకానందుడి జీవితం ఆదర్శనీయం
ABN , Publish Date - Jan 13 , 2025 | 12:13 AM
స్వామి వివేకానందుడిని ఆదర్శంగా తీసుకొని ప్రతి ఒక్కరూ ముందుకు సాగాలని చేవెళ్ల ఎమ్మెల్యే యాదయ్య, మాజీ ఎమ్మెల్యే కేఎస్ రత్నం తెలిపారు. వివేకానంద జయంతి సందర్భంగా ఆదివారం చేవెళ్ల పట్టణ కేంద్రంలో ఆయన విగ్రహానికి కాంగ్రెస్, బీజేపీ నాయకులు నివాళులర్పించారు.
ప్రజాప్రతినిధులు, నాయకులు
ఘనంగా నరేంద్రుడి జయంతి
చిత్రపటాలు, విగ్రహాల వద్ద ఘన నివాళి
చేవెళ్ల/శంకర్‌పల్లి/షాబాద్/ఆమనగల్లు/కడ్తాల/ తలకొండపల్లి/ఇబ్రహీంపట్నం/కందుకూరు/చేవెళ్ల/షాద్‌నగర్ అర్బన్/కేశంపేట, జనవరి 12 (ఆంధ్రజ్యోతి): స్వామి వివేకానందుడిని ఆదర్శంగా తీసుకొని ప్రతి ఒక్కరూ ముందుకు సాగాలని చేవెళ్ల ఎమ్మెల్యే యాదయ్య, మాజీ ఎమ్మెల్యే కేఎస్ రత్నం తెలిపారు. వివేకానంద జయంతి సందర్భంగా ఆదివారం చేవెళ్ల పట్టణ కేంద్రంలో ఆయన విగ్రహానికి కాంగ్రెస్, బీజేపీ నాయకులు నివాళులర్పించారు. మాజీ జెడ్పీటీసీ మాలతికృష్ణారెడ్డి, చేవెళ్ల, ముడిమ్యాల్ పీఏసీఎస్ చైర్మన్లు వెంకట్‌రెడ్డి, ప్రతాప్‌రెడ్డి, చేవెళ్ల మాజీ సర్పంచ్ శైలజాఆగిరెడ్డి, మాజీ ఉప సర్పంచ్ యాదయ్య, బీజేపీ యువనాయకుడు డాక్టర్ వైభవ్‌రెడ్డి, మండల ప్రధాన కార్యదర్శి అనంతరెడ్డి, సీనియర్ నాయకుడు సున్నపు వసంతం, నాయకులున్నారు. అదేవిధంగా శంకర్‌పల్లి మున్సిపల్ బీజేపీ అధ్యక్షుడు బీర్ల సురేష్ కురుమ శంకర్‌పల్లిలో వివేకానందుడి చిత్రపటానికి నివాళులర్పించారు. నర్సింహరెడ్డి, వీరేందర్, శ్రీపాల్‌రెడ్డి, లోకేష్ తదితరులున్నారు. బీజేపీ జిల్లా అధికార ప్రతినిధి శ్రీధర్‌రెడ్డి, పురోహితుడు శ్రీనుపంతులు షాబాద్ మండల కేంద్రంలో వివేకానందుడికి నివాళులర్పించారు. అనంతరం వివేకానంద పొదుపు సంఘం వారు జడ్పీ బాలుర ఉన్నత పాఠశాలలో నిర్వహించిన మండల స్థాయి వ్యాసరచన పోటీల్లో విజేతలకు ప్రథమ, ద్వితీయ, తృతీయ పురస్కారాలు, నగదు అందించారు. సంఘం సభ్యులు, బీజేపీ నాయకులు మాణయ్య, మహేష్, మహేందర్, ఉపేందర్‌రెడ్డి, మహేందర్, విజయ్‌కుమార్, నాయకులున్నారు. ఆమనగల్లు మున్సిపల్ చైర్మన్ రాంపాల్‌నాయక్, బీజేపీ మున్సిపాలిటీ అధ్యక్షుడు విక్రమరెడ్డి, కౌన్సిలర్ విజయ్‌కృష్ణ, ఏబీవీపీ సీనియర్ నాయకుడు శ్రీకాంత్‌సింగ్‌లు ఆమనగల్లు పట్టణంలో ఏబీవీపీ రాష్ట్ర నాయకులు లండం మల్లేశ్, గోరటి భరత్‌ల ఆధ్వర్యంలో వివేకానందుడి విగ్రహానికి నివాళులర్పించారు. అనంతరం శోభయాత్ర నిర్వహించారు. బీజేపీ మండలాధ్యక్షుడు శ్రీను, బీజేపీ, ఏబీవీపీ నాయకులు, కౌన్సిలర్లు సురేశ్, సాయి, మల్లేశ్, సుమన్ నాయక్, తరుణ్, శివ, తదితరులున్నారు. కడ్తాల్ మండల కేంద్రంలో వివిధ పార్టీలు, సంఘాల ఆధ్వర్యంలో వివేకానంద జయంతి వేడుకలు నిర్వహించారు. పీసీసీ సభ్యుడు శ్రీనివా్‌సగౌడ్, డీసీసీబీ డైరెక్టర్ వెంకటేశ్, ఎల్‌హెచ్‌సీఎస్ రాష్ట్ర ఉపాధ్యక్షుడు దశరథ్ నాయక్, డీసీసీ అధికార ప్రతినిధి శ్రీనివా్‌సరెడ్డి, బీసీ సంక్షేమ సంఘంరాష్ట్ర ప్రధాన కార్యదర్శి రాఘవేందర్ లుముఖ్య అతిథులుగా హాజరయ్యారు. బీచ్యనాయక్, రాంచందర్ నాయక్, దోనాదుల మహేశ్, భిక్షపతి, రాజేశ్, బోసు రవి, తదితరులు పాల్గొన్నారు. వివేకానందుని బోధనలు యువతకు స్ఫూర్తిదాయకమని ఫార్చ్యూన్ బట్టర్‌ఫ్లై సీటీ ఎండీ శేషగిరిరావు అన్నారు. కడ్తాల మండల కేంద్రం సమీపంలో ఫార్చ్యూన్ బట్టర్‌ఫ్లై సీటీ లో నూతనంగా ఏర్పాటు చేసిన వివేకనందుడి విగ్రహాన్ని శేషగిరి రావు ఆవిష్కరించారు. ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ రమేశ్, ప్రిన్సిపాల్ సంజీవ్, ఉపాధ్యాయులన్నారు. వివేకానంద జయంతి వేడుకలు తలకొండపల్లి మండల కేంద్రంలో నిర్వహించారు. బీజేవైఎం రాష్ట్ర కోశాధికారి నీలకంఠ పాండు ముఖ్య అతిథిగా హాజరయ్యారు. బక్కికుమార్, వెంకటేశ్, భరత్, అబిషేక్, శేఖర్, వికాస్, రాజు, నవీన్, శివ, శ్రీధర్, తదితరులు పాల్గొన్నారు. బీజేవైఎం ఆద్వర్యంలో ఇబ్రహీంపట్నంలో రక్తదానశిబిరం నిర్వహించారు. నియోజకవర్గ అధ్యక్షుడు రవీందర్‌రెడ్డి ఆద్వర్యంలో ఏర్పాటు చేసిన కార్యక్రమాన్ని బీజేవైఎం రాష్ట్ర అధ్యక్షుడు మహేందర్, బీజేపీ జిల్లా అధ్యక్షుడు నర్సింహారెడ్డిలు ప్రారంభించారు. ఏసీపీ కేవీపీ రాజు, సీఐ మధు, బీజేపీ నాయకులు పోరెడ్డి నర్సింహారెడ్డి, బోసుపల్లి ప్రతాప్, ముత్యాల భాస్కర్, నాయిని సత్యనారాయణ, కొప్పు బాష, పోరెడ్డి అర్జున్‌రెడ్డి, నోముల దయానంద్‌గౌడ్, జక్క రవీందర్‌రెడ్డి, తదితరులున్నారు. వివేకానందుడి జయంతి వేడుకలను మంచాల మండల పరిధిలో ఘనంగా జరుపుకున్నారు. ఆరుట్లలోని ఆయన విగ్రహానికి నివాళులర్పించారు. బీజేపీ అధ్వర్యంలో జరిగిన కార్యక్రమంలో నూకం రాజు, కొంగర జనార్దన్‌రెడ్డి, మెండు వెంకట్‌రెడ్డి, కొంగర శేఖర్‌రెడ్డి, నారాయణ రెడ్డి, గోగిరెడ్డి యాదగిరిరెడ్డి, రవీందర్‌రెడ్డి, గుడ్డిమల్లి రవి, గంట నర్సింహారెడ్డి, వెంకటాచారి, తదితరులున్నారు. పీసీసీ సభ్యుడు జంగారెడ్డి, బీజేపీ మహేశ్వరం కన్వీనర్ దేవేందర్‌రెడ్డి, ఆ పార్టీ మాజీ అధ్యక్షుడు మల్లారెడ్డి, ఏబీవీపీ రాష్ట్ర కార్యదర్శి శ్రీరామ్‌లు కందుకూరు మండలంలోని పలు గ్రామాల్లో నిర్వహించిన వివేకానందుడి జయంతి వేడుకల్లో పాల్గొన్నారు. భానుప్రసాద్, నర్సింహ, జ్యోతిప్రసాద్, వెంకట్‌రెడ్డి, దామోదర్‌గౌడ్, అనిల్, కుమార్, విఘ్నేశ్వర్‌రెడ్డి, తదితరులున్నారు. రిటైడ్ ఎస్బీఐ మేనేజర్ గోపాలచారి, ఇంజనీర్ ఆర్కిటెక్ట్ మహేశ్‌గౌడ్. ఎన్‌ఆర్‌ఐ వెంకటరమణారెడ్డిలు చేవెళ్ల మండల కేంద్రంలోని వివేకానంద కళాశాల వార్షికోత్సవం వేడుకల్లో పాల్గొన్నారు. ప్రిన్సిపాల్ జైపాల్‌రెడ్డి, డైరెక్టర్ ఇంద్రసేనారెడ్డి, కోశాధికారి ప్రభాకర్‌రెడ్డి, అధ్యాపకులు, విద్యార్థిని, విద్యార్థులు పాల్గొన్నారు. షాద్‌నగర్ పట్టణంలో వివేకానందుడి జయంత్యుత్సవాలల్లో ప్రజాప్రతినిధులు, వక్తలు పాల్గొన్నారు. ఫరూఖ్‌నగర్‌లో వివేకనందుడి విగ్రహానికి ఎమ్మెల్యే శంకర్ కాంగ్రెస్ పార్టీ నాయకులతో కలిసి నివాళులర్పించారు. స్వామి వివేకానంద సేవా సమితి అధ్యక్షుడు పి.సాయిప్రకా్‌షరెడ్డి ఆధ్వర్యంలో రైతు కాలనీలో నిర్వహించిన ఉత్సవంలో ఎమ్మెల్సీ నవీన్‌కుమార్‌రెడ్డి, బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు శ్రీవర్ధన్‌రెడ్డి, వీహెచ్‌పీ నేత రమేష్, బీఆర్‌ఎస్ నాయకులు రవీందర్‌యాదవ్, పి.వెంకటేశ్వర్‌రెడ్డి, నటరాజ్‌లు పాల్గొని వివేకానందుడి విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. కేశంపేట మండలంలో వివేకానందుడి జయంతిని కాంగ్రెస్, బీజేపీ, యువజన సంఘాల నాయకులు నిర్వహించారు. మండల కేంద్రంలోని వివేకానంద విగ్రహానికి నివాళులర్పించారు. వేముల్‌నర్వ, కొత్తపేట, కొండారెడ్డిపల్లి, ఇప్పలపల్లి, పాపిరెడ్డిగూడ, లింగంధనలో మిత్ర యువజన సంఘం ఆధ్వర్యంలో నివాళులర్పించారు. కాంగ్రెస్ అధ్యక్షుడు వీరేష్, యూత్ కాంగ్రెస్ అధ్యక్షుడు రమేష్, ఏఎంసీ డైరెక్టర్లు కరుణాకర్, భాస్కర్ గౌడ్, కరుణాకర్ రెడ్డి, సుదర్శన్, రూప్లానాయక్, తైద పర్వతాలు, లంకాల సురేష్‌రెడ్డి, పవన్ కుమార్‌రెడ్డి, జంగయ్య, బీజేపీ నాయకులు పసుల నర్సింహ యాదవ్, శ్రీనివాస్, కర్రెడ్ల నరేందర్ రెడ్డి, తదితరులు పాల్గొన్నారు.