రైలుకింద పడి గుర్తుతెలియని వ్యక్తి దుర్మరణం
ABN , Publish Date - Jan 22 , 2025 | 12:09 AM
మండల పరిధిలోని తిమ్మాపూర్ సమీపంలో రైలుకింద పడి గుర్తుతెలియని వ్యక్తి దుర్మరణం చెందాడని రైల్వే హెడ్‌కానిస్టేబుల్ శ్రీనివాస్ తెలిపారు.
కొత్తూర్, జనవరి 21(ఆంధ్రజ్యోతి): మండల పరిధిలోని తిమ్మాపూర్ సమీపంలో రైలుకింద పడి గుర్తుతెలియని వ్యక్తి దుర్మరణం చెందాడని రైల్వే హెడ్‌కానిస్టేబుల్ శ్రీనివాస్ తెలిపారు. కాగా, మృతుడు 35నుంచి 40సంవత్సరాల వయస్సు కలిగి ఉన్నాడని, తిమ్మాపూర్ రైల్వే స్టేషన్ మాస్టర్ రహమత్ ఫిర్యాదు మేరకు కేసు దర్యాప్తు చేస్తున్నట్లు హెడ్‌కానిస్టేబుల్ తెలిపారు. పూర్తి వివరాలకు 9441407039/9848090426 నెంబర్లకు సంప్రదించాలని ఆయన కోరారు.