ఇడ్లీలో రబ్బరు వచ్చిందని..
ABN , Publish Date - Jan 16 , 2025 | 11:26 PM
పార్శిల్ తీసుకెళ్లిన ఇడ్లీలో రబ్బరు ఉందని ఓ వ్యక్తి తాను రిపోర్టర్‌ను అంటూ రూ.20 వేలు డిమాండ్ చేసిన ఘటన గురువారం షాద్‌నగర్‌లో చోటు చేసుకుంది. పట్టణంలోని పరిగి రోడ్డులో ఉన్న ఓ హోటల్‌లో ఒక వ్యక్తి ఇడ్లీ పార్శిల్ తీసుకెళ్లాడు.

రూ.20వేలు డిమాండ్
పోలీసులకు బాధితుడి ఫిర్యాదు.. విచారణ
షాద్‌నగర్ రూరల్, జనవరి 16(ఆంధ్రజ్యోతి): పార్శిల్ తీసుకెళ్లిన ఇడ్లీలో రబ్బరు ఉందని ఓ వ్యక్తి తాను రిపోర్టర్‌ను అంటూ రూ.20 వేలు డిమాండ్ చేసిన ఘటన గురువారం షాద్‌నగర్‌లో చోటు చేసుకుంది. పట్టణంలోని పరిగి రోడ్డులో ఉన్న ఓ హోటల్‌లో ఒక వ్యక్తి ఇడ్లీ పార్శిల్ తీసుకెళ్లాడు. ఇంటికి వెళ్లిన తర్వాత ఇడ్లీపై రబ్బరు ఉందని రూ.20 వేలు ఇవ్వాలని హోటల్ యజమానిని బెదిరించాడు. తాను విలేకరినని, గతంలో కొన్ని హోటళ్లను మూయించానని చెప్పాడు. దాంతో హోటల్ యజమాని పోలీసులను ఆశ్రయించాడు. వెంటనే పోలీసులు అతడిని అదుపులోకి తీసుకున్నారు. ఈ విషయమై ఇన్‌స్పె క్టర్ విజయ్‌కుమార్‌ను వివరణ కోరగా అదుపులోకి తీసుకున్నది నిజమేనని తెలిపారు. కాగా, పేరు మాత్రం ఆయన వెల్లడించలేదు.